https://oktelugu.com/

Director Shankar: డైరెక్టర్ శంకర్ కి చుక్కలు చూపిస్తున్న నెటిజెన్స్..ఇలాంటి పరిస్థితి ఏ డైరెక్టర్ కి కూడా రాదేమో!

సౌత్ ఇండియన్ సినిమా అంటే చిన్న చూపు చూసే ఎంతో మందికి, ఇది మా సత్తా అని ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసిన శంకర్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని, అతన్ని ఆడియన్స్ ఈ రేంజ్ లో ట్రోల్ చేస్తారని మనం కలలో కూడా ఊహించి ఉండము.

Written By:
  • Vicky
  • , Updated On : August 11, 2024 / 11:48 AM IST

    Director Shankar

    Follow us on

    Director Shankar: సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని ఎవ్వరూ ఊహించని రేంజ్ కి తీసుకెళ్లిన దర్శకులు ఎవరు అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేర్లు శంకర్, రాజమౌళి. శంకర్ మన చిన్నతనం లోనే మూడు దశాబ్దాల ఆడియన్స్ కి తగ్గట్టుగా ఎంతో అడ్వాన్స్ గా అలోచించి సినిమాలు తెరకెక్కించేవాడు. అందుకే ఆయనకీ అపజయమే ఎరుగని దర్శకుడిగా నిన్న మొన్నటి వరకు గొప్ప పేరు ఉండేది. అలాంటి దర్శకుడికి కూడా డిజాస్టర్ ఫ్లాప్ తగులుతుందా అని రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ చిత్రం ఆశ్చర్యపోయేలా చేసింది. 1996 వ సంవత్సరం లో శంకర్- కమల్ హాసన్ కాంబినేషన్ లో ఇండియన్ అనే చిత్రం వచ్చింది. తెలుగు లో ఈ చిత్రం ‘భారతీయుడు’ పేరుతో విడుదలైంది. తమిళనాడు లో ఈ చిత్రం ఎంతటి ప్రభంజనం సృష్టించిందో, తెలుగులో కూడా అంతే ప్రభంజనం సృష్టించింది.

    ఈ చిత్రం లో సేనాపతి క్యారక్టర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక ఐకానిక్ రోల్ గా మిగిలిపోయింది. ఆ సినిమాలోని ప్రతీ సన్నివేశం ఎంతో అద్భుతంగా, ఆడియన్స్ రోమాలు నిక్కపొడుచుకొని విధంగా తెరకెక్కించాడు డైరెక్టర్ శంకర్. అలాంటి సినిమాని రీమేక్ చెయ్యడానికే ఎవ్వరూ సాహసించరు. అలాంటిది శంకర్ ఆ చిత్రానికి సీక్వెల్ చేసే సాహసం చేసాడు. శంకర్ కదా కచ్చితంగా తన మార్క్ టేకింగ్ తో అదరగొడుతాడు, ఇండియన్ సినిమా రేంజ్ లో కాకపోయినా, ఆ మార్క్ స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని తీస్తాడు అని ఆయన అభిమానులు ఆశించారు. కానీ ఒక సినిమాని ఎంత చెత్తగా తియ్యొచ్చు అనేది శంకర్ రీసెంట్ గా విడుదలైన ‘ఇండియన్ 2 ‘ తో నిరూపించాడు. సేనాపతి క్యారక్టర్ ని నాశనం చేసి, నేడు సోషల్ మీడియా లో ఆ క్యారక్టర్ ని నెటిజెన్స్ కామెడీ చేసి, ట్రోల్ల్స్ వేసే స్థాయిలో ఈ చిత్రాన్ని తీసాడు. థియేటర్స్ లో డిజాస్టర్ గా మిగిలిన ఈ చిత్రాన్ని రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో అన్నీ భాషల్లో విడుదల చేశారు. దీంతో ఆ సినిమాలోని సన్నివేశాలను కట్ చేసి, సోషల్ మీడియా లో నెటిజెన్స్ అప్లోడ్ చేస్తూ డైరెక్టర్ శంకర్ ని ట్రోల్ చేస్తూ ఏకిపారేస్తున్నారు.

    సౌత్ ఇండియన్ సినిమా అంటే చిన్న చూపు చూసే ఎంతో మందికి, ఇది మా సత్తా అని ప్రపంచం మొత్తం మన వైపు చూసేలా చేసిన శంకర్ నుండి ఇలాంటి సినిమా వస్తుందని, అతన్ని ఆడియన్స్ ఈ రేంజ్ లో ట్రోల్ చేస్తారని మనం కలలో కూడా ఊహించి ఉండము. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో ‘గేమ్ చేంజర్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయిపోయినట్టే. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రం తో శంకర్ తన వింటేజ్ యాంగిల్ ని మరోసారి ఆడియన్స్ కి చూపిస్తాడని ఆయన అభిమానులు బలమైన విశ్వాసంతో ఉన్నారు.