https://oktelugu.com/

Sobhita Naga Chaitanya Engagement: నిశ్చితార్థం జరిగిన రెండు రోజుల్లోనే అక్కినేని కుటుంబంలో చిచ్చు పెట్టేసిన శోభితా..అసలు ఏమి జరిగిందంటే!

త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. వీళ్ళ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే శోభిత ఎంట్రీ తర్వాత అక్కినేని కుటుంబం లో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 11, 2024 / 11:44 AM IST

    Sobhita Naga Chaitanya Engagement

    Follow us on

    Sobhita Naga Chaitanya Engagement: నాగ చైతన్య తన సినిమాల ద్వారా సోషల్ మీడియా లో ఎంత ట్రెండింగ్ ఉంటాడో చెప్పలేము కానీ, గత 5 ఏళ్ళ నుండి తన వ్యక్తిగత విషయాలతో మాత్రం నిత్యం ట్రెండింగ్ లోనే ఉంటున్నాడు. అప్పట్లో ఆయన సమంత లాంటి స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకోవడం ఒక సెన్సేషన్. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆమెతో విడిపోవడం కూడా ఒక సెన్సేషన్. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రముఖ హీరోయిన్ శోభితా దూళిపాళ్ల తో రెండవ పెళ్ళికి సిద్ధం అవ్వడం లేటెస్ట్ సెన్సేషన్. గత మూడేళ్ళ నుండి శోభిత తో డేటింగ్ లో ఉంటున్న నాగ చైతన్య ఇటీవలే ఆమెతో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు.

    త్వరలోనే పెళ్లి కూడా జరగబోతుంది. వీళ్ళ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇదంతా పక్కన పెడితే శోభిత ఎంట్రీ తర్వాత అక్కినేని కుటుంబం లో జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయం లోకి వెళ్తే శోభితా తమ కుటుంబం లోకి వస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సోషల్ మీడియా లో అక్కినేని నాగార్జున ఆమెకి స్వాగతం పలుకుతూ ఒక పోస్ట్ వేసాడు. కానీ అమల, అఖిల్ నుండి మాత్రం ఇప్పటి వరకు సోషల్ మీడియా లో ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో నాగ చైతన్య శోభిత ని పెళ్లి చేసుకోబోతుండడం వీళ్లిద్దరికీ ఇష్టం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో విషయం ఏమిటంటే అఖిల్ సమంత కి క్లోజ్ ఫ్రెండ్. నాగ చైతన్య తో విడిపోయిన తర్వాత కూడా సమంత ప్రతీ సంవత్సరం అఖిల్ పుట్టినరోజు నాడు ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటుంది. అంతే కాదు ఇప్పటికీ కూడా అఖిల్ తో తన సుఖ సంతోషాలను పంచుకునే మంచి స్నేహితురాలిగా సమంత కొనసాగుతూనే ఉంది. ఆ కారణం చేతనే అఖిల్ ఈ పెళ్లి పట్ల సంతోషంగా లేడని ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది. అంతే కాకుండా నిశ్చితార్థం జరిగిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో నాగ చైతన్య, శోభిత కలిసి పెట్టిన పోస్టులకు కూడా అఖిల్ స్పందించలేదు.

    దీనిని బట్టీ ఆయనకీ ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని అర్థం అవుతున్నట్టు సోషల్ మీడియా లో ఒక ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే, వరుస ఫ్లాప్స్ తో ఉన్న ఆయన ప్రస్తుతం కార్తికేయ సిరీస్ ఫేమ్ చందు మొండేటి తో ‘తండేల్’ అనే చిత్రం చేస్తున్నాడు. సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.