Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో శేఖర్ బాషా ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులకు బాగా బాధని కలిగించింది ఆదిత్య ఓం ఎలిమినేషన్. హౌస్ లో మరీ మంచితనం తో ఉన్నా కూడా జనాలకు నచ్చరు అనడానికి ఆదిత్య ఒక ఉదాహరణ.ఈయన మనకి చిన్న తనం లోనే ‘లాహిరి లాహిరి లాహిరిలో’ అనే చిత్రం ద్వారా సుపరిచితం.ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించాడు కూడా, కానీ అవి పెద్దగా కమర్షియల్ సక్సెస్ సాధించలేకపోయాయి. అయితే సినిమాల్లో ఆదిత్య ఓం చాలా హుషారుగా ఉండేవాడు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నదంటే హౌస్ ని గడగడలాడించేస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ప్రేక్షకుల అంచనాలకు ఆదిత్య ఓం అసలు అందలేదు. ఆయనకీ 50 ఏళ్ళ వయస్సు అన్న విషయం కూడా ఆడియన్స్ కి హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాతనే తెలిసింది.
అంత వయస్సులో కూడా ఆయన కుర్ర కంటెస్టెంట్స్ తో పోటీ పడేందుకు తన వంతుగా ఎంత చేయాలో, అంతా చేసాడు. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఒక్కరి మీద కూడా ఆయన కోపం గా మాట్లాడడం మనం చూసి ఉండము. గొడవలు వచ్చిన పరిస్థితిలో కూడా ఆయనే తగ్గాడు కానీ, ఎక్కడా కూడా తన నోరుని జారేలా చేసుకోలేదు. ఇదే ఆయనకీ మైనస్ అయిందేమో, కోపం వచ్చినప్పుడు కోపం చూపించి కాస్త కంటెంట్ ని ఇచ్చి ఉండుంటే ఈరోజు ఆదిత్య ఓం ఎలిమినేట్ అయ్యేవాడు కాదు. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకడిగా నిలిచేవాడు, కచ్చితంగా టైటిల్ ని కొట్టే అవకాశాలు కూడా ఉండేవి. కానీ ఈ సీజన్ లో సోనియా కేవలం నాలుగు వారాల్లోనే ఎంత నెగటివిటీ ని మూటగట్టుకొని బయటకి వెళ్లిందో, ఆదిత్య ఓం అంతకు మూడింతల పాజిటివిటీ ని మూటగట్టుకొని బయటకి వెళ్ళాడు. ఆయన బయటకి వెళ్ళేటప్పుడు టాస్కులు ఎంత బాగా ఆడగలడో జనాలకు చూపించి మరీ వెళ్ళాడు. అయితే ఆదిత్య ఓం ని మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేసి నిర్దాక్షణంగా పంపించేశారు, ఆయన గురించి కనీసం AV వీడియో కూడా వేయలేదు, బహుశా సీక్రెట్ రూమ్ కి పంపారేమో అని ఆడియన్స్ సోషల్ మీడియా లో అనుకున్నారు.
కచ్చితంగా ఆదిత్య ఓం రీ ఎంట్రీ ఉంటుందని ఊహిస్తూ పోస్టులు వేశారు. అయితే ఆదిత్య ఓం ఎంట్రీ నిజంగానే ఉంటుంది. కానీ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లో ఉండిపోవడానికి మాత్రం కాదు. ప్రతీ వారం కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాక నాగార్జున ఆ కంటెస్టెంట్ ని స్టేజి మీదకు పిలిచి ముందు AV చూపిస్తారు, ఆ తర్వాత హౌస్ లో కంటెస్టెంట్స్ చేత మాట్లాడిస్తారు. రేపటి ఎపిసోడ్ లో ఆదిత్య ఓం తో అదే చేయబోతున్నారు. హౌస్ మేట్స్ మొత్తం ఆదిత్య ఓం ని చూడగానే బాగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఈరోజే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరిగింది.