Disha Patani: తన అందం, అభినయంతో కుర్రకారు మతి పొగొడుతూ.. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన నటి దిశా పటాని. తెలుగులో ఒక సినిమా చేసినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ.. అభిమానులతో ముచ్చటిస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాగా, సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ తమదైన స్టైల్లో దూసుకెళ్లిపోతున్నారు. మరికొంత మంది నోటికి ఏదొస్తే అది నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఇది ఒక పరిమితి వరు బాగున్నప్పటికీ.. హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రయత్నించే ప్రతీసారి ఎవరో ఒకరు ఆకతాయి మాటలతో కాస్త అసభ్యకర మాటలతో ఇబ్బందిపెడుతున్నారు. దీంతో ఇటీవల కాలంలో హీరోయిన్లను అనవసరమైన ప్రశ్నలతో వేధించడం అలవాటుగా మారింది.
తాజాగా, బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానిపై కూడా ఇదే విధంగా ఓ ఆకతాయి వర్లర్గా ప్రశ్నించారు. దిశా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుండగా.. ఓ కుర్రాడు నీ ఫిగర్ సైజ్ ఎంత అంటూ అడిగేశాడు. అయితే, ఈ ప్రశ్నకు దిశా కోప్పడకుండా.. ఫన్నీ పాండా జిఫ్ వీడియోను పోస్ట్ చేసింది. దీన్ని బట్టి ఈ ప్రశ్నను దిశా లైట్‌గా తీసుకుందని అర్థమవుతోంది. కానీస ఆమె అభిమానులు మాత్రం నెటిజన్‌పై ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంటి ప్రశ్నలు అడగడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Netizen vulgar behaviour with star heroin disha patani
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com