Homeఎంటర్టైన్మెంట్Akhanda: పూనకాలు పెట్టిస్తోన్న 'భం భం అఖండ'.. బాలయ్య ఫ్యాన్స్​ పండగ!

Akhanda: పూనకాలు పెట్టిస్తోన్న ‘భం భం అఖండ’.. బాలయ్య ఫ్యాన్స్​ పండగ!

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న సినిమా అఖండ. విభిన్న పాత్రలతో అలరించేందుకు ఈ సినిమాతో సిద్ధమవుతున్నారు బాలయ్య. సింహా, లెజెండ్​ చిత్రాలతో వరుస హిట్​ కొట్టిన బాలయ్య, బోయపాటి మరోసారి హ్యాట్రిక్​ హిట్​ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్​, లిరికర్​ సాంగ్స్​కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మరోవైరు, అఘోరాగా బాలయ్య గెటప్ చూస్తుంటే సినిమా ఏ రేంజ్​లో ఉండనుందో అని అంచనాలు వేసుకుంటున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఈ గెటప్​కు సంబందించిన భం అఖండ భం భం అఖండ అనే టైటిల్​ సాంగ్​ పూర్తి లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఈ సాంగ్​ వీడియో వైరల్​గా మారింది. అనంత్​ శ్రీరామ్​ రాసిన ఈ పాటను తన కుమారులు సిద్దార్థ్​, శివమ్​తో కలిసి శంకర్​ మహదేవన్​ అద్భుతంగా ఆలపించారు. ఇత తమ తన సంగీతంతో పూనకాలు తెప్పించేశారు. ఎలాగైనా ఇండస్ట్రీ హిట్​ కొట్టాలనే బోయపాటి తపన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా కనిపించనుంది. ఇందులో శ్రీకాంత్​ ఓ కీలక పాత్రను పోషించారు.

మరోవైపు అన్​స్టాపబుల్​ విత్​ ఎన్బీకే  షోతో ఆహాలో సందడి చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే తొలి ఎపిసోడ్​ను పూర్తి చేసుకున్న బాలయ్య.. రెండో ఎపిసోడ్​ను నేచురల్​ స్టార్​ నానితో కలిసి రానున్నారు. కాగా, ప్రస్తుతం నాని శ్యామ్​సింగరాయ్​ సినిమాలో హీరోగా కనిపించనున్నారు. పీరియాడికల్​ నేపథ్యంలో ఈ స్టోరీని తెరకెక్కిస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular