https://oktelugu.com/

Salaar Movie Teaser: సలార్ టీజర్ పై నెగిటివ్ ట్రెండ్… ‘డిజప్పాయింటెడ్’ అంటూ!

కెజిఎఫ్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ ఎవరితో మూవీ చేస్తారనే చర్చ నడిచింది. ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అధికారిక ప్రకటన కూడా జరిగింది. అనూహ్యంగా ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో సలార్ ప్రకటించి వెంటనే పట్టాలెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండటం కూడా దీనికి కారణమైంది. మరి ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోతో ప్రశాంత్ నీల్ మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సలార్ పై భారీ హైప్ నెలకొంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 6, 2023 / 11:56 AM IST

    Salaar Movie Teaser

    Follow us on

    Salaar Movie Teaser:  సలార్ టీజర్ విడుదలైంది. గంటల వ్యవధిలో మిలియన్స్ కొద్దీ వ్యూస్ తో దుమ్మురేపింది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే సలార్ టీజర్ పై పెద్ద ఎత్తున నెగిటివిటీ నడుస్తుంది. సోషల్ మీడియాలో నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఆశించినంతగా సలార్ టీజర్ లేదంటున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు. స్టార్ హీరోల బెస్ట్ ఛాయిస్ అయ్యాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు పలు పరిశ్రమలకు చెందిన స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు.

    కెజిఎఫ్ 2 అనంతరం ప్రశాంత్ నీల్ ఎవరితో మూవీ చేస్తారనే చర్చ నడిచింది. ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది. అధికారిక ప్రకటన కూడా జరిగింది. అనూహ్యంగా ప్రశాంత్ నీల్ హీరో ప్రభాస్ తో సలార్ ప్రకటించి వెంటనే పట్టాలెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్ లో బిజీగా ఉండటం కూడా దీనికి కారణమైంది. మరి ఇండియాలోనే బిగ్గెస్ట్ మాస్ హీరోతో ప్రశాంత్ నీల్ మూవీ అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సలార్ పై భారీ హైప్ నెలకొంది.

    మరో మూడు నెలల్లో విడుదల కాగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. నేడు సలార్ టీజర్ విడుదల చేశారు. రెండు నిమిషాల సలార్ టీజర్ యాక్షన్ అండ్ ఎలివేషన్స్ సాగింది. ప్రభాస్ ని పూర్తి స్థాయిలో చూపించలేదు. ఈ క్రమంలో కెజిఎఫ్ 2 టీజర్ తో పోల్చుకుంటే సలార్ టీజర్ ఎక్కడో ఉందంటున్నారు. ఆశించినంతగా సలార్ టీజర్ లేదు. చెప్పాలంటే నిరాశపరిచింది అంటున్నారు. చాలా విషయాల్లో కెజిఎఫ్ ని కాపీ కొట్టినట్లు ఉంది. సలార్ కెజిఎఫ్ రీమేక్ లా ఉంది కానీ… కొట్టడం ఏమీ లేదంటున్నారు.

    ఈ క్రమంలో డిజప్పాయింటెడ్ #disappointed అంటూ నెగిటివ్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఇది ఒకింత భయపడే పరిణామమే. ఆదిపురుష్ మూవీపై వ్యతిరేకత టీజర్తోనే మొదలైంది. అది సినిమా విడుదలయ్యాక కూడా వదల్లేదు. ఈ నెగిటివిటీ ఆదిపురుష్ ని పెద్ద ఎత్తున దెబ్బతీసింది. కాబట్టి ప్రశాంత్ నీల్ జాగ్రత్త పడాలి. కనీసం ట్రైలర్ తో అయినా అంచనాలు పెంచాలి. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ కాగా జగపతిబాబు, పృథ్విరాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు.

    https://twitter.com/Tanu_Priyaaa/status/1676822629066620930

    https://twitter.com/RockKingMacha/status/1676781815674310657