Anand Deverakonda : ఆ గ్రూప్ మా అన్నయ్యను తొక్కేయాలని చూస్తుంది… ఆనంద్ దేవరకొండ కీలక కామెంట్స్

ఫ్యామిలీ స్టార్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు నెగిటివ్ ప్రచారం విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలయ్యాక రెండు రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలి.

Written By: NARESH, Updated On : May 21, 2024 1:35 pm
Follow us on

Anand Deverakonda : విజయ్ దేవరకొండ విపరీతమైన నెగిటివిటీ ఫేస్ చేస్తున్నాడు. ఆయన సినిమాలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతుందనే వాదన ఉంది.ఫ్యామిలీ స్టార్ విషయంలో మరోసారి అది రుజువైంది. ఫస్ట్ షో నుండే నెగిటివ్ టాక్ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ స్టార్ ఓపెనింగ్స్ ని దెబ్బ తీశారు. ఇదంతా ఒక గ్రూప్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తున్నారని తమ్ముడు ఆనంద్ దేవరకొండ అభిప్రాయపడ్డాడు. ఆయన కీలక కామెంట్స్ చేశాడు.

ఆయన లేటెస్ట్ మూవీ గం గం గణేశా. మే 31న విడుదల కానుంది. ఈ క్రమంలో గం గం గణేశా ట్రైలర్ విడుదల చేశారు. గం గం గణేశా చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆనంద్ దేవరకొండకు ఫ్యామిలీ స్టార్ మూవీపై నెగిటివ్ ప్రచారానికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. కేసు కూడా పెట్టారు కదా… ఏమైందని విలేకరులు అడగారు. స్పందించిన ఆనంద్ దేవరకొండ… ఒక సినిమా బాగుందని, బాగోలేదని చెప్పే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఒక వ్యక్తి తన అభిప్రాయం వ్యక్తం చేశాడంటే అర్థం ఉంది.

కానీ ఒక గ్రూప్ తయారై సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం జరిగింది. ఫ్యామిలీ స్టార్ విడుదలకు 48 గంటల ముందు నుండే నెగిటివ్ ప్రచారం మొదలైంది. యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ పెట్టి, విజయ్ దేవరకొండ గత చిత్రాలను ప్రస్తావిస్తూ నెగిటివ్ ప్రచారం చేశారు. అది సరైనది కాదు. అన్నయ్య ఇటీవల రెండు మూడు కొత్త చిత్రాలు ప్రకటించారు. అవి ఫ్యాన్స్, ఆడియన్స్ అంచనాలు అందుకుంటాయి. అలరిస్తాయి అని భావిస్తున్నా, అన్నాడు. పరోక్షంగా ఓ వర్గం విజయ్ దేవరకొండను తొక్కేయాలని చూస్తుందని చెప్పకనే చెప్పాడు ఆనంద్ దేవరకొండ.

ఫ్యామిలీ స్టార్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు నెగిటివ్ ప్రచారం విషయంలో ఆవేదన వ్యక్తం చేశాడు. సినిమా విడుదలయ్యాక రెండు రోజుల వరకు రివ్యూలు రాకుండా చూడాలి. అప్పుడే సినిమా బ్రతుకుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పరిమితికి మించి ఫ్యామిలీ స్టార్ పై తప్పుడు ప్రచారం జరిగిందని దిల్ రాజు ఫైర్ అయ్యాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసిన ఆ గ్రూప్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.