https://oktelugu.com/

Pallavi Prashanth – Shivaji : మాట తప్పిన గురు శిష్యులు… పల్లవి ప్రశాంత్, శివాజీలను ఏకిపారేస్తున్న నెటిజెన్స్!

ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే అది రైతు కుటుంబాల మద్దతు వల్లే జరిగింది. పల్లవి ప్రశాంత్ గేమ్ కి సింపథీ తోడవడంతో టైటిల్ గెలిచాడు. తీరా బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ మార్చేశాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 21, 2024 / 01:21 PM IST

    Pallavi Prashanth

    Follow us on

    Pallavi Prashanth – Shivaji : పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ లో అడుగుపెట్టాడు. సామాన్యుడిగా వచ్చి అనూహ్యంగా విన్నర్ గా నిలిచాడు. అయితే హౌస్ లో ఉన్నప్పుడు ప్రశాంత్ ఒక మాట ఇచ్చాడు. తనకు వచ్చిన ప్రైజ్ మనీ మొత్తం రైతులకు పంచుతానని చెప్పుకొచ్చాడు. హౌస్ లో ఉన్నప్పుడు భారీ డైలాగులు కొట్టాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట గాలికి వదిలేశాడు. షో ముగిసి నెలలు గడుస్తున్నా ప్రశాంత్ రైతులకు సాయం చేయకపోవడంతో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

    ప్రశాంత్ విన్నర్ అయ్యాడంటే అది రైతు కుటుంబాల మద్దతు వల్లే జరిగింది. పల్లవి ప్రశాంత్ గేమ్ కి సింపథీ తోడవడంతో టైటిల్ గెలిచాడు. తీరా బయటకు వచ్చిన తర్వాత ప్లేట్ మార్చేశాడు. సాయం సంగతి దేవుడెరుగు, ఆ మాట అడిగితే నన్ను సీఎం చేయండి .. పీఎం ని చేయండని మాట్లాడాడు. కొందరు నెటిజన్లు రైతులకు ఇస్తానన్న డబ్బులు ఎప్పుడిస్తావని సోషల్ మీడియా వేదికగా గట్టిగా నిలదీయడంతో ఒక లక్ష సహాయం చేశాడు.

    తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల పేరు మీద లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఇచ్చింది లక్ష .. కానీ ఓ రేంజ్ లో హంగామా చేశాడు. భీబత్సమైన ప్రచారం చేశాడు. తన గురువు శివాజీ చేతులు మీదుగా డబ్బులు ఇప్పించాడు. ఆ సహాయం చేసి రెండు నెలలు అవుతున్నా మరో సాయం చేయలేదు. కానీ శివాజీకి మాత్రం తన శిష్యుడు ఇచ్చిన మాట తప్పాడు అంటే కోపం వచ్చింది.

    ప్రశాంత్ ని నిలదీసినట్టు రాజకీయ నాయకులను ఎందుకు అడగరు అంటూ ఫైర్ అయ్యాడు. మరోవైపు ప్రశాంత్ భారీగా సంపాదిస్తున్నాడు అని టాక్. షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి వెళ్తే 2 నుంచి 3 లక్షలు తీసుకుంటున్నాడట. రీసెంట్ గా అతనికి రూ. 15 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ జోసలుకాస్ వారు ప్రజెంట్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ .. రైతులకు ఇవ్వాల్సిన రూ. 35 లక్షల సంగతి ఏంటి? అసలు ఎప్పుడు పంచుతారు నువ్వు నీ గురువు శివాజీ? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.