Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు… ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈయన చేయబోయే సినిమాకు సంబంధించిన కసరత్తులను కూడా భారీ స్థాయి లో చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన తన మేకోవర్ కి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా అర్థమవుతుంది.
ఇప్పటికే పొడగాటి జుట్టుతో, మిల్క్ వైట్ స్కిన్ టోన్ తో ఉన్న మహేష్ బాబు లుక్కు చూస్తే ఆల్మోస్ట్ హాలీవుడ్ సినిమా హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్నాడు. ఆయనను చూసిన ప్రతి ఒక్కరు తెలుగు హీరో అనకుండా హాలీవుడ్ హీరో అని అనుకునే రేంజ్ లో తనను తాను మేకోవర్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానిమీద ఇప్పటికి జక్కన్న అయితే ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అయినప్పటికీ హాలీవుడ్ హీరోయిన్లు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక దీనిమీద రాజమౌళి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మహేష్ బాబు తో ఒక అమ్మాయి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయికి మహేష్ బాబు కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు మహేష్ బాబు తో ఫోటో దిగింది? రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా? అనే పలు రకాల ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. నిజానికి ఆ అమ్మాయి ఎవరంటే ఆమె పేరు నీరు సెహగల్…పంజాబీ ప్రాంతానికి చెందిన ఈమె తన చిన్నతనంలోనే తన ఫ్యామిలీ మొత్తం అమెరికాలో సెటిల్ అవ్వడం వల్ల తన బాల్యమంతా అక్కడే గడిచింది. మొదట మోడలింగ్ రంగంలో అదరగొట్టిన ఈ అమ్మడు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
2015 వ సంవత్సరంలో ‘మిస్ ఇండియా కాలిఫోర్నియా’ టైటిల్ ని కూడా గెలుచుకుంది. ఇక ఆ సంవత్సరమే జరిగిన ‘మిస్ ఇండియా అమెరికా’ పోటీల్లో సెమీఫైనల్ వరకు వెళ్లింది. ‘ఆర్జు ఇ మన్’ అనే సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది. ఇక పలు రకాల సినిమాల్లో కూడా నటించినప్పటికీ ఆమెకు సరైన గుర్తింపు అయితే రాలేదు. ఇక యోగ, ఫిట్నెస్ లాంటివి చేయడం వల్ల ఆమె ఇప్పటికి చాలా ఫిట్ గా కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె మహేష్ బాబు సినిమాలో నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి…ఇక ఈ సినిమాతో పాటుగా మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించబోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి…