https://oktelugu.com/

నెట్టింట్లో ‘ఆంటీ’ ఐటమ్ సాంగ్ వైరల్

ప్రస్తుతం నెట్టింట్లో ఓ ఐటమ్ సాంగ్ హల్చల్ చేస్తోంది. 61ఏళ్ల భామ ఐటమ్ సాంగులో చేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ‘ఆంటీ కిస్కో బోలా’ సాంగులో నటించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆ భామ ఎవరు? ఆమె గురించి నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం..! Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..! ఢిల్లీకి చెందిన నీనా గుప్తా 1959 జూన్ 4న జన్మించింది. ప్రస్తుతం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 30, 2020 / 02:23 PM IST
    Follow us on


    ప్రస్తుతం నెట్టింట్లో ఓ ఐటమ్ సాంగ్ హల్చల్ చేస్తోంది. 61ఏళ్ల భామ ఐటమ్ సాంగులో చేసిన స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా ‘ఆంటీ కిస్కో బోలా’ సాంగులో నటించి అందరిచేత ప్రశంసలు అందుకుంటోంది. ఇంతకీ ఆ భామ ఎవరు? ఆమె గురించి నెటిజన్లు ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం..!

    Also Read: సంచలనం.. సుశాంత్ ది హత్యే అంటున్న ప్రత్యక్ష సాక్షి..!

    ఢిల్లీకి చెందిన నీనా గుప్తా 1959 జూన్ 4న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 61. నీనా గుప్తా బాలీవుడ్ తోపాటు పలు అంతర్జాతీయ సినిమాల్లో నటించింది. పలు టెలివిజన్ షోలను నిర్వహించడంతోపాటు సినిమాలకు దర్శకత్వం వహించింది. ‘గాంధీ’ సినిమాలో గాంధీ మేనకోడలి పాత్రను నీనా గుప్తా పోషించింది. మాధురీ దీక్షిత్తో కలిసి ఖల్‌నాయక్ చిత్రంలో నటించింది. ఆచిత్రంలోని ఛోళీకీ పీఛే క్యాహై అనే పాటలోనూ మెరిసింది. అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్ సెట్టర్ గా నిలిచింది. ప్రముఖ క్రికెటర్ వివీయస్ రిచర్డ్ తో సహజీవనం చేసి ఓ కూతురును కూడా కన్నది. ఆ తర్వాత 2008లో వివేక్ మెహ్రా అనే చార్టెట్ అకౌంటెంటెన్ ను రహస్య వివాహం చేసుకుంది.

    Also Read: ఓటీటీలోకి మరో లెజెండరీ క్రికెటర్ !

    తాజాగా నీనా గుప్తా నటించిన ‘మసాబా మసాబా’ అనే వెబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో నిన్న విడుదలైంది. ఇందులో ‘ఆంటీ కిస్కో బోలా’ అనే పాటలో నీనా గుప్తా నటించింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. నీనా గుప్తాతో తన కూతురు మసాబా గుప్తా కూడా ఈ పాటలో నటించడం విశేషం. దీనిపై నీనా గుప్తా స్పందిస్తూ ఐటమ్ సాంగ్స్‌కు వయస్సుతో సంబంధం లేదని చెబుతోంది. ఈ వెబ్ సిరీస్ లో నీసా గుప్తా అద్భుతంగా నటించారంటూ తన ఇన్ స్ట్రాగ్రామ్లో పోస్టు పెట్టింది. మసాబా గుప్తా కూడా ఆంటీ బులావ్.. మాగర్ ప్యార్ సే. నహిన్ తో.. అంటూ పోస్టు చేసింది. ఈ ఐటమ్ సాంగుపై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లో చర్చించుకుంటున్నారు.