https://oktelugu.com/

కెసిఆర్ లో ఈ మార్పుకి కారణం ఏంటి? ‘మమా’ అనిపిస్తున్నాడు…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే వారు. అటు అధికారులతో గాని ఇటు ఉన్నతస్థాయి ఆఫీసర్లతో గాని గంటలు గంటలు మాట్లాడి స్పష్టమైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఎంతో ఎక్కువ సేపు క్యాబినెట్లో, రాజ్ భవన్ లో సమయం గడిపే కేసీఆర్ లో మాత్రం ఈ మధ్య మార్పు వచ్చేసింది. ఆ తేడా ఎవరైనా ఇట్టే కనిపెట్టవచ్చు. ఎలా ఉన్నా దానిని దాచుకోవడం ఆయనకు చేతకాదు. ముక్కుసూటి మనిషి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 30, 2020 / 02:00 PM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఇతర ముఖ్యమంత్రులతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండే వారు. అటు అధికారులతో గాని ఇటు ఉన్నతస్థాయి ఆఫీసర్లతో గాని గంటలు గంటలు మాట్లాడి స్పష్టమైన సలహాలు సూచనలు ఇచ్చేవాడు. ఎంతో ఎక్కువ సేపు క్యాబినెట్లో, రాజ్ భవన్ లో సమయం గడిపే కేసీఆర్ లో మాత్రం ఈ మధ్య మార్పు వచ్చేసింది. ఆ తేడా ఎవరైనా ఇట్టే కనిపెట్టవచ్చు. ఎలా ఉన్నా దానిని దాచుకోవడం ఆయనకు చేతకాదు. ముక్కుసూటి మనిషి. అతను ఏమి అనుకుంటున్నారో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తను మారిన తీరును కూడా దాచుకోలేరు. మొహమాటం లేకుండా బాహాటంగా చూపించడానికి అస్సలు సంకోచించరు.

    ఇప్పుడు విషయమంతా దేని గురించి అంటే…. తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ను కలిసేందుకు కేసీఆర్ వెళ్లారు. ఎప్పుడైతే నరసింహ స్థానంలో తమిళసై వచ్చారో కెసిఆర్ లో ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గవర్నర్ గా నరసింహన్ ఉన్న రోజుల్లో తరచూ కేసీఆర్ అక్కడ కొద్ది కాలం గడిపేవారు. అదేమంటే ప్రభుత్వ నిర్ణయాలను గవర్నర్ కు వివరించినట్లుగా చెప్పేవారు. దేశంలో మరే రాష్ట్రంలోను ముఖ్యమంత్రి కూడా గవర్నర్ తో అంత ఎక్కువ సేపు గడిపిన దాఖలాలు ఉండేవి కావు.

    కానీ ఈ మధ్య కాలంలో అసలు కెసిఆర్ రాజ్ భవన్ కు అసలు వెళ్ళింది లేదు. నరసింహన్ స్థానంలో తమిళసై వచ్చినప్పటినుండి కెసిఆర్ లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.. ఎప్పుడో ఒకసారి వెళ్తున్నారు…. వెళ్ళిన వారు అలా వెళ్లి ఇలా వచ్చేస్తున్నారు. ఇక తప్పనిసరి సందర్భాల్లో తప్పించి ఆయన అటు వైపు చూస్తే ఒట్టు. ఇక వెళ్ళిన తర్వాత కూడా చాలా తక్కువ వ్యవధిలో తిరిగి వచ్చేస్తున్నారు.

    దీనికి కారణం ఏమంటే ఈ మధ్యన చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని తమిళ సై నిలదీసింది. కరోనా నేపథ్యంలో టెస్టుల విషయంలో కావచ్చు ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కావచ్చు ఏకంగా ప్రభుత్వాన్ని బాధ్యులను చేసే వ్యాఖ్యలు చేసింది. అందుకే గతంలో గవర్నర్ చర్చించినట్లు ప్రభుత్వ విషయాలను చర్చించేందుకు కేసీఆర్ మొగ్గు చూపడం లేదు. తాజాగా గవర్నర్ బంధువు మరణించిన నేపథ్యంలో రాజ్ భవన్ విచ్చేసిన ఆమెని పరామర్శించి కేసీఆర్ వెంటనే తిరిగి రావడంతో అందరికీ విషయం అర్థం అయిపోయింది. వెళ్ళామా…. తిరిగి వచ్చామా అన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. చూద్దాం…. ఎన్నాళ్ళు ఇలా ప్రవర్తిస్తారో…!