Nazriya Nazim: నజ్రియా.. స్వచ్ఛమైన సహజమైన నటి. ‘రాజా-రాణి’ అనే ఒక తమిళ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు బాగా దగ్గరైన ఓ మలయాళ నటి. పైగా ఆ సినిమాలో ఆమెది సెకండ్ హీరోయిన్ పాత్ర. అయితే ఏమి ? అద్భుతంగా నటించింది. పూర్తి పేరు ‘నజ్రియా నజీమ్’. ఆమె నటనను, అలాగే ఆమె పలికించిన హావభావాలను అంత తేలిగ్గా ఎవ్వరూ మరచిపోలేరు.

ఓ సందర్భంలో కేటీఆర్ లాంటి రాజకీయ నాయకుడు కూడా ఈ తరంలో తనకిష్టమైన నటి ఎవరంటే.. నజ్రియానే అని పబ్లిక్ ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పారు. నజ్రియా నటనా సామర్థ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో ఆమె కళ్ళను ఆ కళ్లల్లో మెరిసిన ఎక్స్ ప్రెషన్స్ ను చూసి చాలామంది మనసు పారేసుకున్నారు. అయితే ఆ తర్వాత నజ్రియా మళ్లీ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ 3డీలో.. సరికొత్త అనుభూతి ఇది !
ఎట్టకేలకూ తెలుగు ప్రేక్షకుల మనసులను రంజింపజేయడానికి నాని సినిమాతో తెలుగు చిత్ర సీమలోకి అడుగు పెడుతుంది. ”అంటే సుందరానికి’ అనే సినిమా నజ్రియాకు తెలుగులో డైరెక్ట్ మొదటి సినిమా. ఈ చిత్రంలో నజ్రియా ‘లీలా థామస్’గా నటించనుంది. ఐతే, తాజాగా నజ్రియా లుక్ ను రివీల్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
మార్చి 17న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి నజ్రియా లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ లుక్ కోసం ఆమె తెలుగు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకీ నాని, నజ్రియా కాంబినేషన్ ఎలా ఉంటుంది ? అంటూ ఇప్పటి నుంచే ఆసక్తి రెట్టింపు అయ్యింది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే.. ఈ బ్యూటిఫుల్ హీరోయిన్, హీరో నానితో పోటీ పడి నటిస్తోంది.
ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ లో అయితే, నాని లాంటి నేచురల్ స్టార్ ను కూడా నజ్రియా పూర్తిగా డామినేట్ చేసిందట. నజ్రియా సీన్స్ చాలా బాగా వచ్చాయట. ముఖ్యంగా నానితో సాగే సీన్స్ లో అయితే ఆమె ముందు నాని పూర్తిగా తేలిపోయాడని, నజ్రియా తన కళ్ళతోనే అద్భుతమైన ఫీల్ ను క్రియేట్ చేసిందని చిత్రయూనిట్ లోని సభ్యులే చెబుతున్నారు.

సహజంగా హీరోయిన్లను బాగా నటించమని ఎంకరేజ్ చేసే నాని, నజ్రియా విషయంలో మాత్రం అందుకు అపోజిట్ లో ప్రవర్తిస్తున్నాడట. మొత్తానికి నానిలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. తనది చాలా న్యాచురల్ పెర్ఫామెన్స్ అని ఫీల్ అయ్యే నేచురల్ స్టార్ కూడా.. చివరకు నజ్రియా నేచురల్ నటన ముందు చాలా అసహజంగా నటిస్తున్నాను అని ఫీల్ అవుతున్నాడు. అదీ.. నజ్రియా నటన అంటే. ఆమె మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించాలని కోరుకుందాం.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రంగంలోకి ముఖ్యమంత్రి.. ఇండియాలోనే ఇదో సంచలనం..
[…] Shruti Haasan: శ్రుతి హాసన్.. విశ్వ నటుడు ‘కమల్ హాసన్ కుమార్తె’గానే కాకుండా స్టార్ హీరోయిన్ గా కూడా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఐతే, స్టార్ ఇంట పుట్టిపెరిగిన ఎఫెక్ట్ ఏమో గానీ, ఆమె ఎప్పుడూ ముక్కుసూటితనంతోనే ముందుకు పోతుంది. అందుకే, ముందుగా ముక్కుకే సర్జరీ చేయించుకుందని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తుంటారు అనుకోండి. ఏది ఏమైనా శ్రుతి హాసన్ అంటేనే డేర్ అండ్ డాషింగ్ గర్ల్. […]