https://oktelugu.com/

Nayantara Remuneration: పెళ్లి తర్వాత రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన నయనతార.. ఒక్క సినిమాకి ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందో తెలుసా?

Nayantara Remuneration: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ షూస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార..తెలుగు మరియు తమిళం బాషలలో స్టార్ హీరోలందరితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని అతి తక్కువ సమయం లోనే సౌత్ లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నయనతార..కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పర్చుకుంది ఈమె..ఇటీవలే ప్రముఖ తమిళ డైరెక్టర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 02:07 PM IST
    Follow us on

    Nayantara Remuneration: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ రేంజ్ స్టార్ షూస్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు నయనతార..తెలుగు మరియు తమిళం బాషలలో స్టార్ హీరోలందరితో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని అతి తక్కువ సమయం లోనే సౌత్ లో క్రేజీ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నయనతార..కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పర్చుకుంది ఈమె..ఇటీవలే ప్రముఖ తమిళ డైరెక్టర్ సతీష్ విఘ్నేష్ ని ప్రేమించి పెళ్లాడిన నయనతార, పెళ్లి తర్వాత కూడా సినిమాలు కొనసాగించబోతుంది..ప్రస్తుతం ఈమె టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది..మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..ఈ సినిమా తో పాటుగా ఆమె హిందీ లో షారుక్ ఖాన్ హీరో గా తెరకెక్కిన జవాన్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది..ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించాడు.

    Nayantara

    సాధారణంగా ఏ హీరోయిన్ కి అయినా కూడా పెళ్లి తర్వాత క్రేజ్ తో పాటుగా సినిమా అవకాశాలు కూడా బాగా తగ్గిపోతాయి..కానీ నయనతార కి ఇసుమంత కూడా డిమాండ్ తగ్గలేదు..ఎందుకంటే ఆమె కెరీర్ ప్రారంభం నుండి నేటి వరుకు కేవలం గ్లామర్ షో ని మాత్రమే నమ్ముకోలేదు..నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ వస్తుంది..అందుకే డైరెక్టర్స్ ఈమెతో పని చెయ్యడానికి ఇప్పటికి ఆసక్తి చూపిస్తున్నారు..తనకి ఉన్న డిమాండ్ ని బట్టి నయనతార తన పారితోషికం మరింత పెంచేసింది..నిన్న మొన్నటి వరుకు 4 నుండి 6 కోట్ల రూపాయిలు పారితోషికం తీసుకునే నయనతార.

    Also Read: Vijay Devarakonda: మనం షేక్ చేసినం అమ్మా… ర‌మ్యకృష్ణకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్

    Nayantara

    తన తదుపరి చిత్రాలకు ప్రస్తుతం 10 కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుందట..నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనకాడడం లేదు..దానికి కారణం కూడా లేకపోలేదు..కేవలం నయనతార కోసమే సినిమాలు చూసే ఆడియన్స్ లక్షల్లో ఉంటారు..నయనతార ఒక సినిమా ఒప్పుకుంది అంటే కచ్చితంగా ఆ సినిమాలో బలమైన విషయం ఉంది అనే బ్రాండ్ ఇమేజి ఆడియన్స్ లో ఉన్నది..అందుకే ఆమె తన బ్రాండ్ కి తగ్గ పారితోషికం ని డిమాండ్ చేస్తుంది..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..అంతే కాకుండా నయనతార కి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది..ఈ ప్రొడక్షన్ హౌస్ లో తన అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ కొత్తవాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఇస్తుంది నయనతార.

    Also Read:Bandla Ganesh- Vijay Deverakonda: ఎన్టీఆర్, మహేష్, చరణ్ పేర్లతో ‘విజయ్ దేవరకొండ’కు బండ్ల గణేష్ కౌంటర్

    Tags