Vijay Devarakonda: మనం షేక్ చేసినం అమ్మా… ర‌మ్యకృష్ణకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్

Vijay Devarakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ ను షేక్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ దేవరకొండ సినిమాలకు రాని వ్యూస్ ‘లైగర్’ సినిమాకు రావడం విశేషం. మొత్తమ్మీద వ్యూస్‌లో సెన్సెషన్ క్రియేట్ చేశాడు విజయ్. ట్రెండింగ్‌లో లైగర్ ట్రైలర్ దుమ్ము దులుపుతుంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ర‌మ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. 24 గంటల్లో 51 మిలియన్ వ్యూస్ వచ్చాయి. […]

Written By: Shiva, Updated On : July 23, 2022 1:51 pm
Follow us on

Vijay Devarakonda: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘లైగర్’ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌ ను షేక్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ దేవరకొండ సినిమాలకు రాని వ్యూస్ ‘లైగర్’ సినిమాకు రావడం విశేషం. మొత్తమ్మీద వ్యూస్‌లో సెన్సెషన్ క్రియేట్ చేశాడు విజయ్. ట్రెండింగ్‌లో లైగర్ ట్రైలర్ దుమ్ము దులుపుతుంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ర‌మ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది.

Vijay Devarakonda, ramya krishna

24 గంటల్లో 51 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లైగర్ ట్రైలర్‌ కు వస్తున్న భారీ రెస్పాన్స్ పై రమ్యకృష్ణ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ‘సంతోషంగా చెబుతున్నా.. బిగ్గెస్ట్ ట్రైలర్ ఆఫ్ ద ఇయర్‌గా లైగర్ నిలిచింది. 24 గంటల్లో 51 మిలియన్ వ్యూస్ కౌంటింగ్..’ అంటూ ఓ వీడియోను రమ్యకృష్ణ పోస్ట్ చేసింది.

Also Read: Bandla Ganesh- Vijay Deverakonda: ఎన్టీఆర్, మహేష్, చరణ్ పేర్లతో ‘విజయ్ దేవరకొండ’కు బండ్ల గణేష్ కౌంటర్

అయితే, ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ… ‘మనం ఇండియన్ షేక్ చేసినం అమ్మా..’ అంటూ మెసేజ్ చేశాడు. లైగర్‌ ను అందరి చెంతకు చేరవేయడంలో ఇంకా తన పని పూర్తికాలేదు. ఆ పని ఇప్పుడే మొదలైందంటూ విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు.

Vijay Devarakonda, ramya krishna

పైగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ కష్టపడి సిక్స్ ప్యాక్ చేశాడు. మరి ఆ కష్టానికి ఫలితం దక్కుతుందో లేదో చూడాలి. అన్నిటికీ మించి దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని అంటున్నారు.

ఇక ‘లైగర్’ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్, ఛార్మి, పూరి జగన్నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ 11 డేస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా ?

Tags