https://oktelugu.com/

Samantha- Naga Chaitanya: విడాకులు తర్వాత తొలిసారి కలిసి నటించబోతున్న సమంత – నాగచైతన్య

Samantha- Naga Chaitanya: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య లు విడిపోయి ఏడాది దాటిపోయినా సంగతి మన అందరికి తెలిసిందే..విడాకులు తీసుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది..ఇక రీసెంట్ గా సమంత బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లో పాల్గొన్న సంగతి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2022 / 02:11 PM IST
    Follow us on

    Samantha- Naga Chaitanya: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత – నాగ చైతన్య లు విడిపోయి ఏడాది దాటిపోయినా సంగతి మన అందరికి తెలిసిందే..విడాకులు తీసుకొని ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ ఇద్దరి గురించి సోషల్ మీడియా లో రోజు ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంది..ఇక రీసెంట్ గా సమంత బాలీవుడ్ పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లో పాల్గొన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ ప్రోగ్రాం లో సమంత తన విడాకులు గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ టాపిక్ గా నడుస్తుంది..ఎక్కడ చూసిన ఆమె తన విడాకుల గురించి మాట్లాడిన వీడియోలే తిరుగుతున్నాయి..నాగ చైతన్య పేరు ఎత్తగానే ఆమె మొహం లో ఉన్న కోపం చూస్తుంటే వీళ్లిద్దరి విడాకులు సామరస్యంగా జరగలేదు అనే అనిపిస్తుంది..అయితే ఏదైనా సెన్సషనల్ ఇష్యూ ని కాష్ చేసుకోవడానికి మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మేకర్స్ చూస్తూ ఉంటారు..అలాగే ఇప్పుడు సమంత – నాగ చైతన్య విషయం లో కూడా ఒక విన్నూతన ప్రయోగం చేయబోతున్నారని టాక్ వినిపిస్తుంది.

    Samantha- Naga Chaitanya

    ఒక అసలు విషయానికి వస్తే సమంత మరియు నాగ చైతన్య ని పెట్టి ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ప్రముఖ టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది..విడాకులు తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తే అదొక క్రేజీ కాంబినేషన్ అవుతుందని..బాక్స్ ఆఫీస్ వద్ద కూడా బాగా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు ఆలోచిస్తున్నాడట..ఈమేరకు ఆయన ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్టు తెలుస్తుంది..మరి వీళ్లిద్దరి కలిసి నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి..నాగ చైతన్య కి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ..సమంత మాత్రం ఒప్పుకునే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి కనపడడం లేదు..ఎందుకంటే ఆమె నాగ చైతన్య పేరు ఎత్తితేనే అగ్గిలం మీద గుగ్గిలం అయిపోతుంది.

    Also Read: Nayantara Remuneration: పెళ్లి తర్వాత రెమ్యూనరేషన్ ని భారీగా పెంచేసిన నయనతార.. ఒక్క సినిమాకి ఎన్ని కోట్లు డిమాండ్ చేస్తుందో తెలుసా?

    Samantha- Naga Chaitanya

    కానీ దిల్ రాజు వంటి వారు పూనుకున్నారు కాబట్టి..అనితరసాధ్యమైన కాంబినేషన్స్ సెట్ చెయ్యడం దిల్ రాజు కొత్తేమి కాదు కాబట్టి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..పెళ్లి తర్వాత సమంత – నాగ చైతన్య కలిసి నటించిన సినిమా మజిలీ..ఈ చిత్రం వీళ్లిద్దరి కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందిల..మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఈసారి సెట్ అవుతుందో లేదో చూడాలి..ఇక నాగ చైతన్య హీరో గా నటించిన థాంక్యూ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ రప్పించుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో నిర్మాత దిల్ రాజు తెరకెక్కించిన ఈ సినిమా ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి.

    Also Read:Vijay Devarakonda: మనం షేక్ చేసినం అమ్మా… ర‌మ్యకృష్ణకు విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ పోస్ట్
    Recommended Videos


    Tags