Nayantara Sensational Decision: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ శివన్ ని బంధుమిత్రులు మరియు కొంత మంది సినీ రాజకీయ ప్రముఖులు మధ్య మహాబలిపురం లోని ఒక్క ప్రముఖ రిసార్ట్ లో హిందూ సంప్రదాయాలతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నయనతార పెళ్లికి సంబంధించిన ఫొటోలే కనిపిస్తున్నాయి..సుమారు నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం నయనతార విగ్నేష్ ని పెళ్లాడింది..అంతకు ముందు ఆమె ప్రముఖ హీరో శింబు మరియు ప్రభుదేవా వంటి వారితో ప్రేమాయణం నడిపిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి తో నయనతార రిలేషన్ పెళ్లి వరుకు వచ్చి పెటాకులు అయ్యింది..ఇప్పుడు విగ్నేష్ తో అయినా పెళ్లి అవుతుందా లేదా అని రూమర్లు చక్కర్లు కొడుతున్న సమయం లో ఇటీవలే పెళ్ళాడి సోషల్ మీడియా లో ప్రచారం అయ్యే రూమర్స్ కి చెక్ పెట్టింది..ఇక్కడి వరుకు అంతా బాగానే ఉన్నా ఇటీవల నయనతార తీసుకున్న ఒక్క నిర్ణయం గురించి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Sai Pallavi Craze: సాయి పల్లవి అంటే అందరికీ ఎందుకు అంత అభిమానం?
అదేమిటి అంటే నయనతార ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత శాశ్వతంగా నటనకి గుడ్బై చెప్పబోతుందట..ప్రస్తుతం ఆమె బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్, తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ వంటి సినిమాలతో పాటు ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమా లో నటిస్తుంది..ఈ మూడు సినిమాలు పూర్తి అయినా తర్వాత నటన కి గుడ్బై చెప్పేసి కేవలం సినిమాల నిర్మాతగా మాత్రమే కొనసాగబోతుంది అట..ఇటీవలే ఆమె సమంత మరియు విజయ్ సేతుపతి తో కలిసి కన్మణి రాంబో ఖతీజా అనే సినిమా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి కేవలం ఆమె ఒక హీరోయిన్ మాత్రమే కాదు..నిర్మాత కూడా..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్లేదు అనే రేంజ్ రన్ ని సొంతం చేసుకుంది..ఆమెకి నిర్మాతగా ఇది తొలి కాదు..గతం లో ఆమె 8 సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించింది..ఎప్పుడు భిన్నమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక్క ప్రత్యేకమైన మార్కుని ఏర్పర్చుకున్న నయనతార..నిర్మాతగా కూడా కొత్త రకమైన కథలను ఎంపిక చేసుకుంటూ ఎంతో మంది టాలెంట్ ఉన్న కొత్త నటులను ప్రోత్సహిస్తుంది..ఇన్ని రోజులు కేవలం పార్ట్ టైం నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన నయనతార ఇక నుండి ఫుల్ టైం నిర్మాతగా మారబోతుంది..తన అద్భుతమైన నటనతో ఎప్పటికప్పుడు అభిమానులను మరియు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే నయనతార ఇక నుండి సినిమాల్లో నటించబోదు అనే వార్త అభిమానులకు జీర్ణించుకోవడం కష్టం గా మారింది.

Also Read: Kamal Haasan On Vikram Box Office Success: విక్రమ్ డబ్బులతో నా అప్పులు తీర్చేస్తా… మిగతావి పంచేస్తా!
