Natural Star Nani: న్యాచురల్ స్టార్ నాని చాలా కాలం తర్వాత ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో మన ముందుకి అంటే సుందరానికి అనే సినిమా ద్వారా వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..కామెడీ టైమింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన నాని నుండి గత కొంత కాలం నుండి వరుసగా సీరియస్ కంటెంట్ సినిమాలు మాత్రమే వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..తమ హీరో ఎంటర్టైన్మెంట్ సినిమాలకు బాగా దూరం అయ్యిపోతున్నాడు అని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్న సమయం లో అంటే సుందరానికి సినిమాని ప్రకటించాడు నాని..తన కంఫర్ట్ జోన్ లోకి వచేసాడు..ఈ సినిమా తో 70 కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి నాని చేరబోతున్నాడు అని ట్రేడ్ విశ్లేషకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు..వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే టీజర్ మరియు ట్రైలర్ కూడా ఆకట్టుకుంది..కానీ తీరా విడుదలైన తర్వాత సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కూడా ఈ సినిమా ఆశించిన స్థాయి వసూళ్లను మొదటి రోజు నుండే అందుకోవడం లో విఫలం అవుతూ వస్తుంది..సమ్మర్ సీజన్లో పైగా ఒక సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం ఇటీవల కాలం లో ఎప్పుడు చూడలేదు అని ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.

సమ్మర్ లో వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కావడం తో ఈ మూవీ ని బయ్యర్లు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసారు..మొదటి రోజు ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల రూపాయిల షేర్ వస్తుందని అంచనా వేస్తే కనీసం నాలుగు కోట్ల రూపాయిల షేర్ కూడా రాలేదు..నాని గత చిత్రం శ్యామ్ సింగ రాయ్ సినిమా అతి తక్కువ టికెట్ రేట్స్ మీద కూడా దాదాపుగా నాలుగు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..కానీ అంటే సుందరానికి సినిమాకి భారీ స్థాయి టికెట్ రేట్స్ ఉన్నా కూడా అంత తక్కువ వసూళ్లు రావడం నిజంగా ట్రేడ్ కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు..ఇక రెండవ రోజు మరియు మూడవ రోజు వసూళ్లు పర్వాలేదు అనిపించినా అవి బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం కూడా సహాయపడదు అనే చెప్పాలి.

ఇక సోమవారం కలెక్షన్స్ అయితే ఆదివారం తో పోలిస్తే 70 శాతం కి పైగా పడిపోయాయి..ఈ స్థాయి డ్రాప్స్ కేవలం డిజాస్టర్ సినిమాకి మాత్రమే రావడం ఇది వరుకు మనం చూసాము..కానీ తొలిసారి ఒక్క సూపర్ హిట్ టాక్ వచ్చిన మూవీ కి ఇలాంటి వసూళ్లు చూడడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు..జనాలు OTT కి అలవాటు పడి ఈ సినిమాని OTT లో చూసుకోవచ్చులే అని అనుకున్నారా..లేదా నాని మార్కెట్ బాగా తగ్గిపోయిందా అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు..ఇటీవల కాలం లో అత్యధిక సూపర్ హిట్ సినిమాలు వరుసగా గ్యాప్ లేకుండా విడుదల అవ్వడం..జనాలు వాటికి డబ్బులు బాగా ఖర్చు చెయ్యడం వల్లే అంటే సుందరానికి సినిమా పై ప్రభావం చూపించి ఉండొచ్చు అని ట్రేడ్ పండితుల అభిప్రాయం..పైగా రీసెంట్ టైమ్స్ లో జనాలు థియేటర్ కి కదలాలి అంటే కచ్చితంగా సూపర్ హిట్ సాంగ్స్ ఉండాలి..అంటే సుందరానికి సినిమాలో ఒక్క పాట కూడా క్లిక్ అవ్వకపోవడం కూడా కలెక్షన్స్ పై ప్రభావం చూపించినట్టు తెలుస్తుంది..మొత్తం మీద మూడు రోజులకు గాను 15 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో కేవలం 20 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..దీనితో కనీసం 10 కోట్ల రూపాయిల నష్టం ఈ సినిమాకి వాటిల్లే అవకాశం ఉంది అని తెలుస్తుంది.
నాని ఇక నుండి తన రూటు మార్చి MCA మరియు నేను లోకల్ వంటి మాస్ కమర్షియల్ సినిమాలు తీసి మంచి కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు..ప్రస్తుతం నాని దసరా అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాని కెరీర్ లో ఎంతో ప్రత్యేకం..సుమారు 60 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది..ఈ సినిమాతోనైనా నాని బెస్ట్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.