https://oktelugu.com/

Prince Yawar: డీప్ లవ్ లో ప్రిన్స్ యావర్ .. అతన్ని ప్రేమలో పడేసిన ఆ బిగ్ బాస్ బ్యూటీ ఎవరో తెలుసా?

యావర్ పలు సీరియల్స్ లో నటించినప్పటికీ అతని గురించి పెద్దగా తెలియదు. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చి సత్తా చాటాడు. తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకున్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 10, 2024 / 10:09 AM IST

    Prince Yawar

    Follow us on

    Prince Yawar: బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్ట్ ప్రిన్స్ యావర్ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి నయని పావనితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆమెతో రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, స్పెషల్ సాంగ్స్ లో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి నెటిజన్లు వీళ్ళు ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ తొలిసారి యావర్ అందరి ముందు నయని పావని గురించి ఓపెన్ గా మాట్లాడాడు.

    యావర్ పలు సీరియల్స్ లో నటించినప్పటికీ అతని గురించి పెద్దగా తెలియదు. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా వచ్చి సత్తా చాటాడు. తనకంటూ ఓ గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటూ కెరీర్ పరంగా ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా యావర్ ఒక సినిమాలో లీడ్ రోల్ లో నటించాడు. ఈ సినిమాలో శివ భక్తుడుగా కనిపించబోతున్నాడు.

    ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఈవెంట్ కి హాజరయ్యాడు. యావర్ తో పాటు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శివాజీ, పల్లవి ప్రశాంత్, తేజ, నయని పావని, దామిని వచ్చారు. ఈ క్రమంలో నయని గురించి యావర్ మాట్లాడాడు. నయని కి హెల్త్ బాగాలేదు అయినా కూడా తన కోసం వచ్చింది అని చెప్పాడు. ఇప్పుడే కాదు .. నా కోసం నా పర్సనల్ లైఫ్ లో బ్యాక్ బోన్ లా నిలబడింది. ఎలాంటి కష్టం వచ్చినా నీ వెంట నేను ఉంటాను అని చెప్తూ .. నన్ను ముందుకు నడిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.

    యావర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నయని కూడా యావర్ పట్ల కేర్ చూపించడం .. యావర్ కోసం రావడంతో వాళ్ళు లవ్ లో ఉన్నారు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో నయని పావని కి ఈ ప్రశ్న ఎదురవగా అలాంటిది ఏమీ లేదని కొట్టిపారేసింది. కొన్నాళ్లు గడిస్తే కానీ వీరి బంధం మీద క్లారిటీ రాదు.