https://oktelugu.com/

Rajamouli: తన డైరెక్షన్ తో సూపర్ హిట్స్ అందుకుంటున్న రాజమౌళి..ఆ విషయం లో మాత్రం అట్టర్ ప్లాప్ అయ్యాడు…

అల్లరి నరేష్, రాజీవ్ కనకాల మెయిన్ లీడ్ లో వచ్చిన 'విశాఖ ఎక్స్ ప్రెస్' అనే సినిమాకి కూడా రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అయితే సాధించలేదు.

Written By:
  • Gopi
  • , Updated On : March 10, 2024 / 10:13 AM IST

    Rajamouli

    Follow us on

    Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న రాజమౌళి గత రెండు, మూడు సినిమాలతో పాన్ ఇండియా లో తన సత్తా చాటుతూ వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఒక పాన్ వరల్డ్ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను వరల్డ్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలపాలని చూస్తున్నాడు. అయితే రాజమౌళి దర్శకుడిగా ఎంత సక్సెస్ సాధిస్తున్నాడో మిగతా రంగాల్లో మాత్రం అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోతున్నాడు. ఆయన ‘అందాల రాక్షసి’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అయినప్పటికీ ఈ సినిమా సక్సెస్ ని అయితే సాధించలేదు.

    దాంతో పాటుగా అల్లరి నరేష్, రాజీవ్ కనకాల మెయిన్ లీడ్ లో వచ్చిన ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ అనే సినిమాకి కూడా రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమా కూడా ఆశించిన విజయాన్ని అయితే సాధించలేదు. ఇలా రాజమౌళి కేవలం దర్శకుడుగా మాత్రమే సక్సెస్ అవుతున్నాడు తప్ప మిగతా వాటిలో అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోవడం చూస్తున్న ట్రేడ్ పండితులు సైతం రాజమౌళిని ఐరన్ లెగ్ గా భావిస్తున్నారు.

    అందుకే ఆయనని సినిమాలో ఏ రకంగాను ఇన్ క్లూడ్ చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ ఇష్టపడడం లేదని కేవలం దర్శకుడిగా మాత్రమే ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు అనే సమాధానాలు అయితే వస్తున్నాయి. అయితే రాజమౌళి ప్రొడ్యూసర్ గా, సమర్పకుడిగా వ్యవహరించిన ఆ సినిమాలు ఎందుకు సక్సెస్ అవడం లేదు అంటే ఆ కథల్లో పెద్దగా దమ్ము ఉండడం లేదు. అందువల్లే ఆ సినిమాలు పోతున్నాయి అంతే తప్ప రాజమౌళి ఐరెన్ లెగ్ అనేది ఏమీ లేదు అని మరి కొంతమంది రాజమౌళి అభిమానులు మాత్రం చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు…

    ఇక మొత్తానికైతే చాలా మంది ప్రొడ్యూసర్లు ఈయనతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయి లో నిలపాలని ప్రయత్నం చేస్తున్నాడు…