spot_img
Homeఎంటర్టైన్మెంట్Naveen Polishetty: బంపర్ ఛాన్స్ కొట్టేసిన నవీన్ పోలిశెట్టి..పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో క్రేజీ...

Naveen Polishetty: బంపర్ ఛాన్స్ కొట్టేసిన నవీన్ పోలిశెట్టి..పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో క్రేజీ మూవీ ఫిక్స్!

Naveen Polishetty: వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో మంచి ఊపు మీదున్న నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty), తర్వాత ఏమి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద చర్చ సాగుతోంది. సినిమా సినిమాకు తన మార్కెట్ రేంజ్ ని పెంచుకుంటూ వెళ్తున్న నవీన్ పోలిశెట్టి, ఈసారి ఏకంగా స్టార్ లీగ్ పై కన్నేసినట్టు తెలుస్తోంది. ఇకపై మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే చేయకుండా, పెద్ద స్థాయి సినిమాలు చేసేందుకు ఆయన ఆసక్తి చూపిస్తున్నాడట. నవీన్ పోలిశెట్టి సినిమా అంటే , ఒక డిఫరెంట్ టైపు ఎంటర్టైన్మెంట్ జానర్ లో ఉంటుందని ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఆయన మార్క్ కామెడీ పంచు డైలాగ్స్, ఎమోషన్స్ తోనే మొదటి నాలుగు సినిమాలు నెట్టుకొచ్చాడు. కానీ ఆడియన్స్ కి నవీన్ పోలిశెట్టి ఇలాగే ఉంటే ఎదో ఒక రోజు ఆయన బోర్ కొట్టేయొచ్చు.

అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి కచ్చితంగా మేక్ ఓవర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయన ఇప్పుడు ఒప్పుకున్న రెండు సినిమాల స్టోరీలు కూడా ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలకు చాలా బిన్నంగా ఉంటుందని సమాచారం. అందులో ఒక సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఉంటుందని సమాచారం. రీసెంట్ గానే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ హోమ్ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ‘అనగనగా ఒక రాజు’ అనే చిత్ర చేసి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ విషయం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ జోక్యం కూడా ఎంతో కొంత ఉంది. నవీన్ పోలిశెట్టి పని తీరు ని దగ్గరుండి బాగా గమనించిన త్రివిక్రమ్, ఆ సమయం లోనే తన వద్ద ఉన్న ఒక కాన్సెప్ట్ ని నవీన్ పోలిశెట్టి కి వినిపించగా, అది ఆయనకు బాగా నచ్చేసింది.

పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ అయ్యాక వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెంటనే నవీన్ పోలిశెట్టి మూవీ ని మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వెంకటేష్ తో చేస్తున్న చిత్రం ఆగస్టు లో పూర్తి అవుతుంది. ఆ తర్వాత రెండు నెలలు గ్యాప్ ఇచ్చి నవీన్ పోలిశెట్టి తో మూవీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ తో ‘గాడ్ ఆఫ్ వార్’ చిత్రం కూడా కమిట్ అయ్యాడు త్రివిక్రమ్. కానీ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న మూవీ బాగా ఆలస్యం అయ్యేలా ఉంది.ఈ గ్యాప్ లో త్రివిక్రమ్, నవీన్ పోలిశెట్టి మూవీ తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular