Naveen Polishetty: ప్రస్తుతం ఉన్నటువంటి యంగ్ హీరోల్లో, భవిష్యత్తులో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అవుతారు అనుకున్న హీరోల లిస్ట్ తీస్తే అందులో నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) నెంబర్ 1 స్థానం లో ఉంటాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్ లోనూ అద్భుతంగా నటించగల హీరో ఆయన. చాలా మంది నవీన్ పోలిశెట్టి ని నేటి తరం మెగాస్టార్ చిరంజీవి అని అంటుంటారు. చిరంజీవి తన సినిమాల్లో కంటెంట్ ఉన్నా లేకపోయినా, తన టాలెంట్ తో ఆడియన్స్ ని థియేటర్స్ లో చివరి వరకు కూర్చోబెట్టడం లో నేర్పరి. ఆ టాలెంట్ నవీన్ పోలిశెట్టి కి ఉందని విశ్లేషకులు అంటుంటారు. కానీ నవీన్ పోలిశెట్టి పై ఉన్న ఏకైక కంప్లైంట్ ఏమిటంటే, సినిమాలు వేగంగా చేయడు అనే. ఒక్కో సినిమాకు ఆయన రెండేళ్ల సమయం తీసుకుంటాడు. ‘జాతి రత్నాలు’ చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకున్న నవీన్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తో’ 2023 వ సంవత్సరం లో మన ముందుకు వచ్చాడు.
ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని జనవరి 13 , 2026న ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్న నవీన్ పోలిశెట్టి, తాను సినిమాలు ఆలస్యంగా చేయడానికి గల కారణాలు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నా సినిమాలు బాగా టైం పట్టొచ్చు. అందుకు ఒక సింపుల్ రీజన్ , నేను ఆ ఫేస్ లో ఉన్నప్పుడు, ఎవరైనా సినిమాకు వెళ్దాం రారా అంటే, ఆమ్మో 400 రూపాయిలు పెట్టి సినిమాకు పోవాలా?, అంత ఓపిక లేదని, సినిమా బాగాలేదని చెప్పి తప్పించుకునేవాడిని. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి సినిమా బాగాలేకపోతే మనం నిరుత్సాహానికి గురి అవుతుంటాము, ఆ 400 రూపాయిలు అనేది చాలా విలువైనది. ఒక కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలంటే 2000 ఖర్చు అవుతుంది’.
‘రెండున్నర గంటల సమయం కూడా కేటాయించాలి. ఆడియన్స్ పెట్టేది నల్ల డబ్బు కాదు, మిడిల్ క్లాస్ పేరెంట్స్, స్టూడెంట్స్, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఇలా రకరకాల జాబ్స్ చేసేవాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంత మాకోసం పెడుతారు. మీరు పెట్టే ప్రతీ పైసాకి వినోదం అందించాలని నేను తపన పడుతాను. ఆ ఒక్క కారణం తోనే నేను ఎక్కువ సమయం తీసుకుంటాను. అందుకే ఏజెంట్ శ్రీనివాస్, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఇలా వరుసగా నాకు సూపర్ హిట్స్ వస్తున్నాయి. ఇందులో నేను చేసిందేమి లేదు, మీరు చేసిందే, మీరు చూపించిన ప్రేమకు డబుల్ ప్రేమని చూపించడం కోసమే ఈ అనగనగ ఒక రాజు సినిమా చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి.
నా సినిమాలు ఆలస్యం కావడానికి రీజన్ ఏంటంటే..#NaveenPolishetty #AnaganagaOkaRaju pic.twitter.com/PGP659NsSe
— Telugu360 (@Telugu360) December 26, 2025