
Hero Naveen Chandra: హీరో నవీన్ చంద్ర తండ్రి అయ్యాడు. ఆయన భార్య ఓర్మా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 22న ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఓర్మా ప్రసవించారు. ఈ విషయాన్ని నవీన్ చంద్ర సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఆ దేవుడు మాకు అబ్బాయిని ప్రసాదించారంటూ ఆనందంతో కూడిన కామెంట్ పోస్ట్ చేశారు. నవీన్ చంద్ర తండ్రైన నేపథ్యంలో చిత్ర ప్రముఖులు, అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
నవీన్ చంద్ర ఫ్యామిలీ విషయాలు పెద్దగా షేర్ చేసుకోరు. ఆయనకు వివాహం ఎప్పుడు జరిగిందనే సమాచారం కూడా లేదు. భార్య పేరు ఓర్మా అని తెలుస్తుంది. ఇటీవల వాలెంటైన్స్ డే నాడు గర్భవతిగా ఉన్న భార్య ఫోటోలు షేర్ చేశారు. నిన్ను ఎప్పుడు చేతులతో ఎత్తుకుంటానా అని ఆతృతగా ఉందంటూ పుట్టబోయే బిడ్డను ఉద్దేశిస్తూ కామెంట్ పోస్ట్ చేశారు.
నవీన్ చంద్ర కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో జన్మించాడు. వీరిది తెలుగు ఫ్యామిలీ. నవీన్ చంద్ర తండ్రి కర్ణాటక ఆర్టీసీ ఎంప్లాయ్. 2006లో సంభవామి యుగే యుగే మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. అందాల రాక్షసి చిత్రంతో ఫేమ్ తెచ్చుకున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన అందాల రాక్షసి ట్రై యాంగిల్ ట్రాజిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది.

హీరోగా పలు చిత్రాలు చేశాడు. అయితే బ్రేక్ రాలేదు. ఈ క్రమంలో పంథా మార్చి విలన్ అయ్యాడు. నాని హీరోగా 2017లో విడుదలైన నేను లోకల్ మూవీలో నవీన్ చంద్ర విలన్ రోల్ చేశారు. అలాగే అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో విలన్ గా కనిపించారు. పలు చిత్రాల్లో ఆయన నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన పరంపర సిరీస్ రెండు సీజన్స్ విడుదలయ్యాయి. హాట్ స్టార్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది. అమ్ము టైటిల్ తో తెరకెక్కిన డిజిటల్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. అమ్ము ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది.