తమిళ టాప్ హీరో అజిత్ చిత్రంలో నవదీప్

మంచి నటుడు అయినప్పటికీ కాలం కలిసి రాక వెనుక బడ్డ హీరో నవదీప్. `చందమామ , గౌతమ్ ఎస్ ఎస్ సి `వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచిన ఈ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆల వైకుంఠపురంలో ‘ కనిపించిన నవదీప్ ఇపుడు తమిళం లో టాప్ హీరో తో కల్సి నటించ బోతున్నాడు. తమిళ టాప్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమా చేస్తున్నాడు . . ఇందులో […]

Written By: admin, Updated On : April 29, 2020 1:32 pm
Follow us on


మంచి నటుడు అయినప్పటికీ కాలం కలిసి రాక వెనుక బడ్డ హీరో నవదీప్. `చందమామ , గౌతమ్ ఎస్ ఎస్ సి `వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచిన ఈ హీరో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆల వైకుంఠపురంలో ‘ కనిపించిన నవదీప్ ఇపుడు తమిళం లో టాప్ హీరో తో కల్సి నటించ బోతున్నాడు. తమిళ టాప్ హీరో అజిత్ ప్రస్తుతం ‘వాలిమై’ అనే సినిమా చేస్తున్నాడు . . ఇందులో అజిత్ పోలీస్ అధికారిగా కనిపించ నున్నాడు .కాగా ఈ చిత్రం లో ఓ కీలకపాత్ర కోసం తెలుగు యువ హీరో కార్తికేయ ని , ఆ తర్వాత నవీన్ చంద్ర ని నటింప జేయాలని అనుకొన్నా కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు . అయితే తాజాగా నవదీప్ ఆ పాత్ర కోసం ఎన్నిక అయినట్టు తెలుస్తోంది.

అన్ని సక్రమంగా జరిగితే దసరాకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వస్తుంది . శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఖాఖీ ఫేమ్ హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇకపోతే ఇందులో అజిత్ సరసన బాలీవుడ్ భామ హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. ఇక అజిత్ తాజా చిత్రం ‘నెర్కొండ పారవై’ (తెలుగు లో వకీల్ సాబ్ ) ను డైరెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టిన హెచ్.వినోత్ ఈ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ చేయాలని తపన తో కష్టపడుతున్నట్టు తెలుస్తోంది .