Rayalaseema water issues: నీటి విషయంలో రెండు తెలుగు స్టేట్లలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నీటి కేటాయింపుల్లో రెండు ప్రాంతాల్లో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులపై కేంద్రం జోక్యం చేసుకోవడంతో ఇక అన్నింటికి దానిపైనే ఆధారపడాల్సి వస్తోంది. గతంలో నీటి విషయంలో ఏ అభ్యంతరాలు లేకపోయినా ప్రస్తుతం మాత్రం ఇలా జరగడంతో తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయే సూచనలున్నాయి. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు సైతం తమ గళం విప్పుతున్నాయి.

సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రం పెత్తనంపై హిందూపురం శాసనసభ్యుడు, సినీనటుడు బాలకృష్ణ స్పందించారు. రాయలసీమ నీటి కేటాయింపుల్లో మిగులు జలాలు కాకుండా నికర జలాల్లో వాటా కావాలని పేర్కొన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్ పై హిందూపురం లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. పాలకుల నిర్లక్ష్యంతో రాయలసీమ దుర్భిక్షంగా మారుతోందని దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నిర్వాకాన్ని ఎండగడతామని బాలకృష్ణ ఉద్ఘాటించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు ప్రాంతాలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. నీటి కేటాయింపులపై పట్టింపులకు పోతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరడంతో విభేదాలు నెలకొన్నాయి. ఇన్నాళ్లు స్నేహితులుగా ఉన్న సీఎంలు ఒక్కసారిగా శత్రువులుగా మారిపోయారు. సాగునీటి రంగంలో ఇంత దారుణమైన పరిస్థితులు చోటుచేసుకోవడంతో రెండు ప్రాంతాలు భగ్గుమంటున్నాయి. నేతల్లో హైరానా ఏర్పడుతోంది.
Also Read: AP Employees: జీతమో రామచంద్రా.. ఉద్యోగుల్లో వ్యతిరేకత.. జగన్ అధికారాన్ని కూల్చేస్తుందా?
దేశ రాజధాని ఢిల్లీలో పోరాటానికి నేతలు సిద్ధమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ఏపీకి చేస్తున్న నష్టంపై గళం విప్పేందుకు సిద్ధమయ్యారు. తమ ప్రాంతం దుర్భిక్షంగా మారకముందే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నీటి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీతో కూడా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. సాగునీటిని తరలించే క్రమంలో తమకు దక్కాల్సిన వాటా కోసం ఉద్యమించేందుకు వెనుకాడటం లేదు.
Also Read: Telangana: కేటీఆర్ ఆశ.. కేసీఆర్ తీర్చడం లేదా? కారణమేంటి?