Natural Star Nani: విభిన్నమైన కథను ఎంచుకోవడంలో నాచురల్ స్టార్ నాని కి ఎవరు సాటి రాలేరు అనే చెప్పాలి. ప్రతి సినిమాకి తనదైన శైలిలో వినోదాన్ని ప్రేక్షక అభిమానుల కు అందిస్తారు నాని. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్ “ఈ సినిమా టీజర్ ను నాలుగు భాషల్లో విడుదల చేశారు యూనిట్ బృందం. ఈ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుంది ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు నాని.
టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “శ్యామ్ సింగ రాయ్ ” ఈ చిత్రంలో నానికి జోడిగా సాయి పల్లవి, కృతి శెట్టి ,మడోన్నా సెబాస్టియన్ నటిస్తున్నారు.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ J. మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల కానుంది ఈ చిత్రం.
టీజర్ విడుదల అయిన సందర్భంగా మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచింది. అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. జెర్సీ చూశాక మీ నటన లో ఇంకొక కోణం ఈ సినిమాలో చూడగలమా టీజర్ చూశాక మీ నటన పై ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది మీరేమంటారు? నాని… ప్రతి సినిమా ద్వారా ఏదో విషయాన్ని లేదా కొత్త దశను స్టార్ట్ చేయడానికి చేస్తాం. కొన్ని కుదురుతాయి. కొన్ని కుదరవు. ప్రయత్నంలో లోపం ఉండదు… ఎపిక్ లవ్ స్టోరీలో ‘రాయాలన్నా, కాల రాయాలన్నా…అని మొదటి సారి ప్రెస్ చేసి చెప్పినట్టుంది? నాని… రాయాలన్నా, కాల రాయాలన్నా’ ఈ డైలాగ్ మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు నా పాత్రకు సంబంధించి రైటర్ ఎలిమెంట్ అనేది ఉంది నవ్వుతూ బదులిచ్చారు ఈ ఏడాది క్రిస్మస్ ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు నాని.