Actress Genelia: సూపర్ స్టార్ మహేశ్ బాబుకి సూపర్ గిఫ్ట్ ఇచ్చిన నటి జెనీలియా…

Actress Genelia: తెలుగు తమిళ హిందీ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జెనీలియా. తెలుగులో విడుదలైన “బాయ్స్ “సినిమాతో సక్సెస్ ను అందుకని అక్కడినుండి సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ , ఆరంజ్ వంటి వరుస విజయాలతో దూసుకుపోయారు ఈ భామ.ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే సినిమాల అనంతరం బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ప్రేమ వివాహం చేసుకున్నారు. జెనీలియా వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. […]

Written By: Raghava Rao Gara, Updated On : November 18, 2021 5:38 pm
Follow us on

Actress Genelia: తెలుగు తమిళ హిందీ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జెనీలియా. తెలుగులో విడుదలైన “బాయ్స్ “సినిమాతో సక్సెస్ ను అందుకని అక్కడినుండి సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, రెడీ , ఆరంజ్ వంటి వరుస విజయాలతో దూసుకుపోయారు ఈ భామ.ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు అయితే సినిమాల అనంతరం బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ జెనీలియా ప్రేమ వివాహం చేసుకున్నారు.

జెనీలియా వివాహానంతరం సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవలే హిందీలో ప్రసారమవుతున్న “లేడీస్ అండ్ జెంటిల్మెన్ ” అనే షో లో హోస్ట్ గా వ్యవహరించారు ఈ జంట. తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన ఇక్కడి వారితో స్నేహ బంధాలను కొనసాగిస్తున్నారు ఈ అమ్మడు. అయితే ఇటీవలే ఈ దంపతులు ఒక కొత్త బిజినెస్ ని ప్రారంభించారు మాంసం తినని వారికోసం అదే టెస్టుతో మరియు న్యూట్రీషియన్స్ తో ఉండేలా వెజ్ ఐటమ్స్ ఉత్పత్తి చేసే “ఇమేజిన్ మీట్స్” అనే పేరుతో ఒక బిజినెస్ ని ప్రారంభించారు దీనిలో భాగంగా తమ ఫుడ్ ని సెలబ్రిటీస్ బహుమతిగా పంపిస్తున్నారు ఈ జంట.

అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కు “ఇమేజిన్ మీట్స్” నుండి ఫుడ్ ఐటమ్స్ ని పంపించారు రితేష్ జెనీలియా దంపతులు. దీనిపై మహేష్ బాబు స్పందిస్తూ “ఇమేజిన్ మీట్స్” పంపించినందుకు కృతజ్ఞతలు వెంటనే టేస్ట్ చేయాలి అనే ఆత్రుతతో ఉన్నానని అన్నారు. తన పట్ల అభిమానంతో పంపించినందుకు థ్యాంక్స్ చెబుతూ జెనీలియా, రితేష్ ని ఇంస్టాగ్రామ్ స్టోరీలో ట్యాగ్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు.