https://oktelugu.com/

Natural Star Nani: ఆ విషయంలో మహేష్ బాబుని ఫాలో అవుతున్న నాచురల్ స్టార్ నాని …

Natural Star Nani: టాలీవుడ్ లో రీమేక్ చిత్రాల్లో విజయం సాధించిన హీరోలుగా విక్టరీ వెంకటేష్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వీరు తర్వాత రీమేక్ చిత్రాలు తెరకెక్కించిన అవి అంతంత మాత్రమే విజయాలు అందుకున్నాయి. అయితే టాలీవుడ్ లో కొందరు హీరోలు రీమేక్ చిత్రాలకు దూరంగానే ఉంటారు. వారిలో మొదటి గా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పుకోవచ్చు. హీరో అయ్యాక రెండు ద‌శాబ్దాల‌కు పైగా అయినా మ‌హేష్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 22, 2021 / 08:52 PM IST
    Follow us on

    Natural Star Nani: టాలీవుడ్ లో రీమేక్ చిత్రాల్లో విజయం సాధించిన హీరోలుగా విక్టరీ వెంకటేష్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. వీరు తర్వాత రీమేక్ చిత్రాలు తెరకెక్కించిన అవి అంతంత మాత్రమే విజయాలు అందుకున్నాయి. అయితే టాలీవుడ్ లో కొందరు హీరోలు రీమేక్ చిత్రాలకు దూరంగానే ఉంటారు. వారిలో మొదటి గా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పుకోవచ్చు. హీరో అయ్యాక రెండు ద‌శాబ్దాల‌కు పైగా అయినా మ‌హేష్ కెరీర్లో ఒక్క రీమేక్‌లోనూ న‌టించ‌లేదు. రీమేక్‌ లో నటించడం త‌న‌కు ఎగ్జైట్మెంట్ ఉండదని అందుకే రీమేక్ లో న‌టించేది లేద‌ని తేల్చి చెప్పారు మహేష్.

    అయితే ఇదే జాబితాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు న‌ర‌సింహుడు సినిమా తప్ప అతని కెరీర్లో రీమేక్ చిత్రాలు లేవనే చెప్పాలి. తాజాగా నాని కూడా ఇదే జాబితాలో చేరారు. రీమేక్‌లు త‌న‌కు సెట్ కావ‌ని తాను ఇక‌పై ఎప్పుడూ రీమేక్‌ల్లో న‌టించ‌న‌ని నాని కూడా తేల్చి చెప్పేశాడు. భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఆహా క‌ళ్యాణం రీమేక్‌లే అయినా ఈ రెండు చిత్రాలు నానికి ఆశించినంత ఫలితాలు ఇవ్వలేదనే చెప్పాలి. దీంతో నాని ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను రీమేక్‌లు చేయ‌డం కంటే త‌న సినిమాల‌ను వేరే భాష‌ల్లో రీమేక్ చేయ‌డం త‌న‌కు సంతోషంగా ఉందని నాని తెలిపారు. ప్రస్తుతం నాని నటించిన జెర్సీ చిత్రం హిందీలో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. హిందీ లో జెర్సీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలానే నిన్ను కోరి చిత్రం కూడా తమిళ లో రీమేక్ కావడం విశేషంగానే చెప్పుకోవాలి.