Tollywood: డైరెక్టర్ దేవ కట్టా – హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “రిపబ్లిక్”. ఎలాంటి కమర్షియల్ లెక్కలూ వేసుకోకుండా నిజాయతీతో చేసిన ప్రయత్నం ఈ చిత్రం. సామాజిక అంశాలపై ఒక గవర్నమెంట్ ఉద్యోగి నిజాయితీగా స్పందించి అంశాలపై తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని థియేటర్లలో ఎంత మంది చూశారన్నది కాదు ఎంతమందికి స్ఫూర్తినిచ్చిందన్నది ముఖ్యం అని. అయితే ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మరింతగా ఆదరణ పెరిగింది అన్నారు దర్శకుడు దేవా కట్టా తెలిపారు.
దేవా కట్టా దర్శకత్వం వహించిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ 5 ఓటీటీలో ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అలానే మెగా తనయురాలు నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” ఓటిటి వేదికగా జీ లోనే విడుదలై ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దేవా కట్టా నిహారిక జి వేదిక ద్వారా ముచ్చటించారు. ఈ క్రమంలో దేవా కట్టా మాట్లాడుతూ… రిపబ్లిక్ బాక్సాఫీసు పరంగా ఈ సినిమా రూ.7 కోట్లు సాధించింది కానీ అదే మాకు వంద కోట్లతో సమానం అని చెప్పుకొచ్చారు.
అనంతరం “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ” వెబ్ సిరీస్ నిర్మాత నిహారిక మాట్లాడుతూ… నేను ఎలాంటి సినిమాలు చూడ్డానికి ఇష్టపడతానో, అలాంటి సినిమాలే నిర్మించాలి అనుకుంటున్నా భవిష్యత్తులో నా నుంచి కూడా ఓ యాక్షన్ సినిమా వస్తుందేమో చెప్పలేను. అంతా బాగుంటే దేవా కట్టా గారితో కూడా ఓ సినిమా చేసినా చేస్తా అని అన్నారు. తాను నిర్మించిన “ముద్ద పప్పు ఆవకాయ్, నాన్న కూచి” వంటివి కూడా జీ 5 ఫ్లాట్ ఫామ్‌లోనే ఉండడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.