Nani: నా హృదయం ముక్కలైంది అంటూ న్యాచురల్ స్టార్ నాని ఎమోషనల్ కామెంట్స్..అసలు ఏమైందంటే!

ఇప్పుడు కూడా మలయాళం సినీ ఇండస్ట్రీ లో మహిళా నటులు ఎదురుకుంటున్న సమస్యలపై మొట్టమొదట టాలీవుడ్ నుండి స్పందించిన హీరో గా నాని నిలిచాడు. ఆయన మాట్లాడుతూ ' మలయాళం ఇండస్ట్రీ లో హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం, మహిళా ఆర్టిస్టులు ఎదురుకుంటున్న కష్టాల గురించి చదివిన తర్వాత నా మనసు ఎంతో ఆవేదనకు గురైంది.

Written By: Vicky, Updated On : August 24, 2024 5:36 pm

Nani(2)

Follow us on

Nani: తప్పు జరిగితే నిర్మొహమాటంగా, ధైర్యంగా మాట్లాడే తత్త్వం ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో న్యాచురల్ స్టార్ నాని పేరు కచ్చితంగా ఉంటుంది. ఆంధ్ర ప్రదేశ్ లో గత ప్రభుత్వానికి ఎదురు తిరిగితే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురు అవుతాయో మన అందరం కళ్లారా చూసాము. సినీ ఇండస్ట్రీ సర్వనాశనం అయ్యేలాగా, టికెట్ రేట్స్ ని భారీ గా తగ్గిస్తూ, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో మీద గొంతెత్తి మాట్లాడేందుకు ఒక్కరిలో కూడా ధైర్యం లేకుండా పోయింది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే నిలబడ్డాడు. ఆయన తర్వాత ఇండస్ట్రీ నుండి ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని ధైర్యంగా తన గళం వినిపించిన ఏకైక హీరో నాని మాత్రమే. అప్పట్లో మంత్రులు, అధికారులు నాని పై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, ఆయన మీద అనేక కామెంట్స్ చేసారు, అయినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. ఆ సమయంలోనే నాని అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించాడు.

ఇప్పుడు కూడా మలయాళం సినీ ఇండస్ట్రీ లో మహిళా నటులు ఎదురుకుంటున్న సమస్యలపై మొట్టమొదట టాలీవుడ్ నుండి స్పందించిన హీరో గా నాని నిలిచాడు. ఆయన మాట్లాడుతూ ‘ మలయాళం ఇండస్ట్రీ లో హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం, మహిళా ఆర్టిస్టులు ఎదురుకుంటున్న కష్టాల గురించి చదివిన తర్వాత నా మనసు ఎంతో ఆవేదనకు గురైంది. వారి కష్టాలను తలచుకొని నా గుండె ముక్కలైంది. నేను నటించే సినిమా సెట్స్ లో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు. సినిమాల్లోకి రాణించాలి అనే ఆశతో వచ్చే మహిళలకు అనువైన పరిస్థితులు కల్పించాలి. పెద్ద హీరోల సినిమాల షూటింగ్స్ లో ఇలాంటివి జరగవని అనుకుంటున్నా.’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఈ నెల 29 వ తారీఖున విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి టీజర్, ట్రైలర్ పాటలు ఇలా అన్నీ అభిమానులను, ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై అమితాసక్తిని పెంచాయి.నేడు మధ్యాహ్నం నుండి ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం అయ్యాయి. అయితే మిడ్ వీక్ విడుదల కావడంతో ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో అయితే అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబడుతుందని ఆశిస్తున్నారు. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. కేవలం ప్రీమియర్స్ నుండే ఈ చిత్రానికి 5 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు లక్షల డాలర్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయట. నాని గత చిత్రాలు కూడా ఓవర్సీస్ లో మంచి వసూళ్లను రాబట్టాయి. దీనిని బట్టీ నాని కి అక్కడ స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ఉందని అర్థం అవుతుంది.