https://oktelugu.com/

Ravi Teja: రవితేజ హెల్త్ అప్డేట్: తొలిసారి స్పందించిన మాస్ మహారాజ్, ప్రజెంట్ కండిషన్ ఇదే!

హీరో రవితేజ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. లేటెస్ట్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో రవితేజ ప్రమాదానికి గురయ్యాడు. రవితేజ కండిషన్ క్రిటికల్ గా ఉందని ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఎట్టకేలకు స్పందించిన రవితేజ, ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : August 24, 2024 / 05:28 PM IST

    Ravi Teja(2)

    Follow us on

    Ravi Teja: జయాపజయాలతో సంబంధం లేకుండా రవితేజ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన 75వ చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రమాదానికి గురయ్యాడు. రవితేజకు గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రవితేజ తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ ఫోటో నిజం కాదు. రవితేజ గత చిత్రానికి సంబంధించిన ఫోటో అని విశ్వసనీయ వర్గాలు వివరణ ఇచ్చాయి.

    అభిమానుల్లో మాత్రం ఆందోళనలు కొనసాగాయి. ఎట్టకేలకు రవితేజ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఫ్యాన్స్ సంతోషించే న్యూస్ షేర్ చేశారు. ”విజయవంతంగా సర్జరీ ముగిసింది. డిశ్చార్జ్ అయ్యాను. క్షేమంగా ఉన్నాను. మీ దీవెనలకు, మద్దతుకు కృతజ్ఞతలు..” అని ట్విట్టర్ ఎక్స్ లో రవితేజ రాసుకొచ్చాడు. రవితేజ తన హెల్త్ కండిషన్ ఏంటో స్వయంగా తెలియజేసిన నేపథ్యంలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

    రవితేజ 75వ చిత్రాన్ని నూతన దర్శకుడితో చేస్తున్నాడు. భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు. ఈ చిత్రంలో రవితేజకు జంటగా శ్రీలీల నటిస్తుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ధమాకా కాంబో మరోసారి రిపీట్ అవుతుంది. రవితేజ-శ్రీలీల-భీమ్స్ కాంబోలో వచ్చిన ధమాకా సూపర్ హిట్ కొట్టింది. ఇక రవితేజ గాయం నుండి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆయన కుడిచేతి మజిల్స్ కి సర్జరీ జరిగినట్లు సమాచారం.

    కాగా రవితేజ గత చిత్రం మిస్టర్ బచ్చన్ నిరాశపరిచింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీపై అభిమానులు సైతం పెదవి విరిచారు. హరీష్ శంకర్ తెరకెక్కించిన కొన్ని సీన్స్, రాసిన డైలాగ్స్ వివాదాస్పదం అయ్యాయి. విడుదలకు ముందు హరీష్ శంకర్ చేసిన పరుష వ్యాఖ్యలు సైతం సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. రవితేజ కెరీర్లో మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ గా నిలిచింది.

    ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి గ్యాప్ రాగా.. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ మూవీ చకచకా పూర్తి చేసి విడుదల చేశాడు. రవితేజ తో పాటు హరీష్ శంకర్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ధమాకా తర్వాత రవితేజ చేసిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. ఆయన స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సి ఉంది.