Homeఎంటర్టైన్మెంట్Nari Nari Naduma Murari Twitter Talk: శర్వానంద్ 'నారీ నారీ నడుమ మురారి' ట్విట్టర్...

Nari Nari Naduma Murari Twitter Talk: శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ ట్విట్టర్ టాక్ వచ్చేసింది..నెటిజెన్స్ రియాక్షన్స్ వైల్డ్ గా ఉందిగా!

Nari Nari Naduma Murari Twitter Talk: చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోల్లో ఒకరు శర్వానంద్(Sharwanand). ఇతను పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ ని అందుకొని దాదాపుగా పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో ఒకటి రెండు యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ, అత్యధిక శాతం డిజాస్టర్ సినిమాలే ఉన్నాయి. అలాంటి శర్వానంద్ నుండి నేడు నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari Movie) చిత్రం విడుదలైంది. కాసేపటి క్రితమే […]

Nari Nari Naduma Murari Twitter Talk: చాలా కాలం నుండి సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోల్లో ఒకరు శర్వానంద్(Sharwanand). ఇతను పూర్తి స్థాయి కమర్షియల్ సక్సెస్ ని అందుకొని దాదాపుగా పదేళ్లు అయ్యింది. ఈ పదేళ్లలో ఒకటి రెండు యావరేజ్ సినిమాలు ఉన్నాయి కానీ, అత్యధిక శాతం డిజాస్టర్ సినిమాలే ఉన్నాయి. అలాంటి శర్వానంద్ నుండి నేడు నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari Movie) చిత్రం విడుదలైంది. కాసేపటి క్రితమే ప్రీమియర్ షోస్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు ఉండడంతో థియేటర్స్ ఈ చిత్రానికి దొరకడం చాలా కష్టమైంది. వైజాగ్ లాంటి సిటీ లో సింగల్ స్క్రీన్స్ నుండి ఈ చిత్రానికి కేవలం మూడు షోస్ మాత్రమే దొరికాయి అంటనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఎలాంటి పోటీ ని ఎదురుకుంటుంది అనేది. అయితే ఈ చిత్రాన్ని చూసిన నెటిజెన్స్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు వచ్చిన రివ్యూస్ ని ఒకసారి పరిశీలిద్దాం.

ట్విట్టర్ ఆడియన్స్ అందిస్తనున్న టాక్ ని బట్టీ చూస్తే ఈ చిత్రం కూడా పాస్ అయినట్టే అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ బాగుందని, కొన్ని చోట్ల కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని అంటున్నారు, కానీ ప్రతీ 20 నిమిషాలకు వచ్చే ట్విస్టులు చూసి ఆడియన్స్ కాస్త అయోమయ్యాం కి గురయ్యారని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్టైన్మెంట్ గా సాగిందో, సెకండ్ హాఫ్ అంతకంటే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో సాగిందని, ఈరోజు విడుదలైన నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ కంటే ఈ చిత్రమే బాగుందని, కానీ కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందో లేదో అని భయపడుతున్నారు మేకర్స్. ఎందుకంటే ఇప్పటికే రెండు సంక్రాంతి సినిమాలకు జనాల్లో పాజిటివ్ టాక్ అద్భుతంగా వచ్చింది. టికెట్ సేల్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయి. ఈ రెండు సినిమాలను దాటుకొని ‘నారీ నారీ నడుమ మురారి’ కి టాక్ రావడం కష్టం అని అంటున్నారు.

ఈ సినిమాని విడుదలకు ముందు సరైన రీతిలో ప్రొమోషన్స్ చేయడం లో మూవీ టీం ఘోరంగా విఫలమైందని అంటున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రామ్ అబ్బూరి. ఆయన గత చిత్రం ‘సామజవరగమనా’. శ్రీ విష్ణు హీరో గా నటించిన ఈ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం మూవీ టీం చేసిన ప్రొమోషన్స్. ఆ రేంజ్ ప్రమోట్ చేసి ఉండుంటే ఈ సినిమా లెవెల్ వేరేలా ఉండేదని, ఇప్పుడు ఇంత ఇరుకు రిలీజ్ లో టాక్ రావడం, అది వ్యాప్తి చెందడం అనేది చాలా కష్టమైన విషయమని అంటున్నారు విశ్లేషకులు. బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 1500 టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది మంచి ట్రెండ్. రేపు ఎలా ఉండబోతుందో చూడాలి.

Nari Nari Naduma Murari Twitter Talk (1)
Nari Nari Naduma Murari Twitter Talk (1)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper