Naresh Third Wife Ramya Raghupathi: గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో నరేష్ మరియు పవిత్ర లోకేష్ వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..నరేష్ మూడవ భార్య రమ్య మరియు పవిత్ర లోకేష్ మాజీ భర్త సుచేంద్ర ఇద్దరు కూడా ఈ జంట పై తలో దిక్కు టార్గెట్ చేసి రాచి రంపాలు పెడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పటికి వీళ్ళ వివాదం కొనసాగుతూనే ఉంది..ఇటీవలే బెంగళూరు లో ఒక రూమ్ లో నివాసం ఉంటున్న నరేష్ మరియు పవిత్ర లోకేష్ లను చెప్పు తో కొట్టడానికి ఆయన మూడవ భార్య వచ్చిన సంఘటన పెద్ద దుమారమే రేపింది..దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంది..నరేష్ – పవిత్ర లోకేష్ పెళ్లిని జరగనివ్వను అని..నా కంఠం లో ప్రాణం ఉన్నంతవరుకు వాళ్లిదరు ఎలా పెళ్లి చేసుకుంటారో నేను కూడా చూస్తానని రమ్య మీడియా ముఖంగా వ్యాఖ్యానించిన సంగతి మన అందరికి తెలిసిందే.

Also Read: Deepak Hooda: కోహ్లీకి ఎసరుపెడుతున్న దీపక్ హుడా.. ఇంగ్లండ్ లోనూ దుమ్మదులిపాడు.. రికార్డు బద్దలు
ఇది ఇలా ఉండగా నరేష్ మూడవ భార్య రమ్య గురించి నరేష్ చెల్లెలు పూజిత చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది..రమ్య తో నరేష్ అన్నయ్య సుమారు పదేళ్లు కాపురం చేసాడని..వీళ్లిద్దరికీ బిడ్డ పుట్టిన తర్వాత రమ్య మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలిసి నరేష్ ఆమెని దూరం పెట్టాడని పూజిత ఈ సందర్భంగా మాట్లాడింది..అంతే కాకుండా నరేష్ ని రమ్య చాలా టార్చెర్ పెట్టేది అట..రోజు మొత్తం షూటింగ్ చేసి నరేష్ ఇంటికి వచ్చేలోపు రాత్రులు 11 అయిపోయేది అని..ఆకలి తో వచ్చి అన్నం పెట్టమని అడిగితె ‘నేను అందరి లాంటి అమ్మాయిని అనుకుంటున్నావా..నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి అన్నం పెట్టమని అడిగితె పెట్టడానికి’ అని చాలా కటువుగా సమాధానం చెప్పేది అట..నరేష్ అలా చాలా రాత్రులు అన్నం తినకుండానే ఆకలి తో పడుకునేవారట..అంతే కాకుండా నేను నరేష్ ఇంట్లోనే ఉండేదానిని అని రమ్య చెప్పిన మాటలు పచ్చి అబద్దం అంటూ పూజిత ఈ సందర్భంగా మాట్లాడింది..నేను ఎప్పుడు ఇంటికి వెళ్లిన కేవలం నరేష్ గారు మాత్రమే ఉండేవారని..రమ్య అసలు ఒక్కసారి కూడా ఇంట్లో కనిపించలేదని చెప్పుకొచ్చింది పూజిత..అలా మానిసికంగా ఎన్నో విధాలుగా టార్చెర్ ని తట్టుకొని విసుగెత్తిపోయిన నరేష్ చివరికి ఆమెని దూరం పెట్టాడని చెప్పుకొచ్చింది పూజిత.

Also Read: RRR Movie Mistakes: ఆర్ఆర్ఆర్ లో ఇప్పటికీ రాజమౌళిని వెంటాడుతోంది అదేనట?
[…] […]