Senior Hero Naresh Marriage Life: టాలీవుడ్ నటుడు నరేశ్ గురించి ఇప్పుడందరూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు. మూడో భార్యను వదిలేసి నాలుగో పెళ్లికి రెడీ అయిన నరేశ్ చరిత్రను తవ్వుతున్నారు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందమైన పవిత్రా లోకేష్ తో ప్రస్తుతం సహజీవనం చేస్తున్న ఈ సుందరాంగుడు గురించి అందరూ వెతుకుతున్నారు. ఆయన మూడు పెళ్లిళ్ల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే నరేశ్ ఆ మధ్య ‘ఓపెన్ హార్ట్ విత్’ ఆర్కేలో పలు నిజాలు వెల్లడించారు. ఆ వీడియో నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నరేష్ కు 19 ఏళ్ల వయసు అప్పుడే పెళ్లి అయిపోయిందని.. లోకం తెలియనప్పుడే తనకు కొడుకు కూడా పుట్టాడని తెలిపాడు. ఆ తర్వాత మొదటి భార్యతో విడాకులు అయ్యాయని.. మా ఇద్దరికీ పుట్టిన ‘నవీన్’ ఇప్పుడు నాతోనే ఉంటున్నాడని నరేశ్ తెలిపాడు. హీరోగా ఎడిటర్ గా నవీన్ రాణిస్తున్నాడని వివరించాడు.
Also Read: Naresh-Pavitra Lokesh Marriage Controversy: పవిత్రా- నరేష్ పై మరో ప్రూఫ్ విడుదల.. ఆడేసుకుంటున్నారు
ఇక రెండో వివాహం చేసుకొని ఆమెతోనూ ఒక కొడుకును కన్నానని..ఆ అబ్బాయి కూడా నాతోనే ఉన్నాడని.. అతడు కళలు,పెయింటింగ్, గ్రాఫిక్స్ లో స్థిరపడ్డాడని నవీన్ తెలిపాడు.

ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో లేడీ రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్న నరేష్ ఆమెతోనూ ఒక కొడుకును కనడం విశేషం. ప్రస్తుతం పవిత్రా లోకేష్ తో బిడ్డను కంటాడా? లేదా? అన్నది వేచిచూడాలి. నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా ఆయన అమ్మ విజయనిర్మల సపోర్ట్ చేశారట.. అయితే ఇప్పుడు మూడో భార్య రమ్యకు విడాకుల నోటీసులు ఇచ్చాడు. ఆమెతో కలిసి పుట్టిన బిడ్డను ప్రస్తుతానికి దూరం పెట్టారు. తల్లితోనే ఉంచుతున్నాడు. రమ్యకు ఎఫైర్లు ఉన్నాయని నరేష్ ఆరోపిస్తున్నాడు.

ఇక తనకు నాన్న ఎవరో తెలియదని.. విజయనిర్మల మొదటి భర్తపై నరేష్ క్లారిటీ ఇచ్చాడు. తనకు గాడ్ ఫాదర్ కృష్ణ మాత్రమేనని స్పష్టం చేశాడు. తనకు నాలుగేళ్ల వయసు అప్పుడే తన నాన్న-అమ్మ విజయనిర్మల విడిపోయారని నరేష్ చెప్పుకొచ్చాడు. ఆయనతో సంబంధాలు లేవన్నారు.
ఇక కృష్ణగారు, తన కుమారులు రమేష్, మహేష్ లతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని నరేష్ తెలిపారు.కృష్ణా ఎప్పుడూ తనను, రమేష్-మహేష్ లను వేరుగా చూడలేదని.. అందరినీ కలిపి తీసుకొని సహృద్భావ వాతావరణంలో పెంచాడని నరేష్ వివరించాడు. తమకు ఇందిర ఫ్యామిలీతో గొడవలు లేవని క్లారిటీ ఇచ్చాడు.
Also Read:Silk Smitha: సిల్క్ స్మిత చనిపోయిన తరువాత ఆ స్టార్ హీరో ఎందుకలా చేశాడు?
[…] […]
[…] […]