Kalyan Ram Wife Favourite Hero: టాలీవుడ్ లో నందమూరి కుటుంబం కి ఉన్న స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి నట వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ మరియు జూనియర్ ఎన్టీఆర్ లు నేడు ఇండస్ట్రీ లో ఏ స్థానం లో కొనసాగుతున్నారో మన అందరికి తెలిసిందే..మాస్ లో వీళ్ళని కొట్టే హీరోలు మరొకరు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక వీళ్ళ బాటలోనే అడుగులు వేసాడు మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్..తొలి రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపొయ్యేసరికి ఈయన కూడా తారకరత్న లాగానే సక్సెస్ కాలేదేమో అని నందమూరి అభిమానులు అనుకున్నారు..కానీ అలాంటి సమయం లో అతనొక్కడే అనే సినిమా ద్వారా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు కళ్యాణ్ రామ్..ఆ సినిమాతో బలంగా ఇండస్ట్రీ లో నిలబడిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత కెరీర్ లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసి అటు నిర్మాతగా ఇటు హీరో గా సక్సెస్ అయ్యాడు..ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన బింబిసారా అనే చిత్రం ఆగష్టు లో విడుదల కాబోతుంది..దీనికి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చెయ్యగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

Also Read: BJP- Rajya Sabha: ఆ నలుగురికి రాజ్యసభ ఎంపికతో బీజేపీకి లాభం ఏంటి?
నందమూరి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దాదాపుగా 40 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు కళ్యాణ్ రామ్..టీజర్ మరియు ట్రైలర్ కేవలం అభిమానులను మాత్రమే కాదు..ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది..ఈ సినిమాని బాహుబలి మరియు KGF తరహాలో ఫ్రాంచైజ్ గా తెరకెక్కిస్తాడట కళ్యాణ్ రామ్..ఈ ఫ్రాంచైజ్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించనున్నాడట..ఈ సినిమా కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుందని చాలా నమ్మకం తో ఉన్నాడు..ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంత వరుకు నిలబెడుతుందో చూడాలి..ఇది ఇలా ఉండగా కళ్యాణ్ రామ్ గారి భార్య స్వాతి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు..వైద్య రంగం లో గొప్ప ప్రావిణ్యం ఉంది అట..అంతే కాకుండా ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తన భార్య స్వాతి ఇష్టాయిష్టాలు గురించి మాట్లాడుతూ , స్వాతి కి మన టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కి వీరాభిమాని అట..ఇప్పటి వరుకు ఆమె మన్మధుడు సినిమాని ఎన్ని వందల సార్లు చూసి ఉంటుందో లెక్కే లేదట..నాగార్జున సినిమా విడుదల అవుతుందంటే చాలు కాలేజీ కి బంక్ కొట్టిమరి థియేటర్స్ కి వెళ్ళేది అట..ఇలా తన భార్య గురించి ఎవ్వరికి తెలియని ఎన్నో ఆసక్తికమైన విషయాలు పంచుకున్నాడు కళ్యాణ్ రామ్.

Also Read: Ponniyin Selvan: సౌత్ సినిమాకి రేపు పండగే.. భారీ మల్టీస్టారర్ గ్లింప్స్ రెడీ
[…] […]