https://oktelugu.com/

Naresh- Pavitra Lokesh: పవిత్ర లోకేష్ తో పరీక్షలు రాయించిన నరేష్… ఇంతకీ ఆమె ఏం చదువుతున్నారు?

సినిమా వీళ్లది కావడంతో రమ్య రఘుపతి క్యారెక్టర్ ని ఇష్టం వచ్చినంత బ్యాడ్ గా చూపించారు. అందులో నిజమెంత అనేది వారికే తెలియాలి. రమ్య రఘుపతి మీద రివేంజ్ కోసం కూడా ఈ మూవీ తీశారని అనుకోవచ్చు.

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2023 / 04:54 PM IST

    Naresh- Pavitra Lokesh

    Follow us on

    Naresh- Pavitra Lokesh: నరేష్-పవిత్ర లోకేష్ టాలీవుడ్ హాట్ కపుల్. గత ఏడాది కాలంగా సెన్సేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మళ్ళీ పెళ్లి అంటూ ప్రేక్షకులను పలకరించారు. తమ బంధం గొప్పదని నిరూపించుకునేందుకు కోట్లు వెచ్చించారు. నాకు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని చెబుతున్న నరేష్ ఓ పది కోట్లు పెట్టి మళ్ళీ పెళ్లి తీశారు. ఈ మూవీ ద్వారా ఆయన వ్యక్తిగత జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు. నరేష్-పవిత్ర లోకేష్-రమ్య రఘుపతి జీవితాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా మళ్ళీ పెళ్లి తెరకెక్కింది.

    సినిమా వీళ్లది కావడంతో రమ్య రఘుపతి క్యారెక్టర్ ని ఇష్టం వచ్చినంత బ్యాడ్ గా చూపించారు. అందులో నిజమెంత అనేది వారికే తెలియాలి. రమ్య రఘుపతి మీద రివేంజ్ కోసం కూడా ఈ మూవీ తీశారని అనుకోవచ్చు. పలుమార్లు మీడియా సాక్షిగా నరేష్ క్యారెక్టర్ పై రమ్య రఘుపతి దారుణ ఆరోపణలు చేశారు. మళ్ళీ పెళ్లి మూవీతో రమ్యకు నరేష్ షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్స్ లో పవిత్ర-నరేష్ రిలేషన్, అఫెక్షన్ పై పిచ్చ క్లారిటీ వచ్చింది.

    నరేష్ ఆమెను పిచ్చగా ప్రేమిస్తున్నారు. తల్లి విజయ నిర్మలతో పవిత్ర లోకేష్ ని పోల్చారు. ఉన్నంత కాలం హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారు. ప్రపంచాన్ని చుట్టి రావాలనేది వారి కోరిక అట. ఇప్పటికే కొన్ని ఇష్టమైన ప్రదేశాల్లో విహరించారు. అలాగే పవిత్ర లోకేష్ కోరింది ఏదైనా తెచ్చిపెట్టేలా నరేష్ ఉన్నాడు. పవిత్ర లోకేష్ కర్ణాటకకు చెందినవారు. ఆమెకు కన్నడలో పిహెచ్ డీ చేయాలనే కోరిక ఉందట.

    అడిగిందే తడవుగా పవిత్ర లోకేష్ చేత పి హెచ్ డి ప్రవేశ పరీక్ష రాయించాడు. ఈ ఎగ్జామ్ కోసం పవిత్ర-నరేష్ కర్ణాటక వెళ్లారట. ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ వయసులో చదువుకోవాలన్న పవిత్ర లోకేష్ కోరికతో పాటు నరేష్ ఆమెను ప్రోత్సహిస్తున్న విధానాన్ని నెటిజెన్స్ కొనియాడుతున్నారు. కాగా నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి నుండి ఓ ఏడేళ్ల క్రితం విడిపోయారు. ఓ నాలుగేళ్లుగా పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్నాడు.