https://oktelugu.com/

Senior Actor Naresh: దానిలో బన్నీ, మహేష్ లతో పోటీ పడుతున్న నరేష్

Senior Actor Naresh:  ఎన్టీఆర్ నుండి మెగాస్టార్ వరకూ ఒకప్పటి స్టార్ హీరోలంతా షూటింగ్ లో గ్యాప్ వస్తే.. పక్కన ఏదైనా చెట్టు ఉంటే అక్కడే సేద తీరేవారు. కానీ, ప్రస్తుతం కాలం మారింది. ముఖ్యంగా గత పదేళ్లుగా ట్రెండ్ మారింది. ఇప్పుడు చిన్నాచితకా హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా క్యారవ్యాన్ లకు అలవాటు పడ్డారు. దీనికితోడు వాళ్లకు ఒక్క హిట్ వస్తే చాలు.. ఇక నిర్మాతలు వాళ్లకు అన్ని దగ్గర ఉండి ఏర్పాట్లు […]

Written By:
  • Shiva
  • , Updated On : January 26, 2022 / 12:13 PM IST
    Follow us on

    Senior Actor Naresh:  ఎన్టీఆర్ నుండి మెగాస్టార్ వరకూ ఒకప్పటి స్టార్ హీరోలంతా షూటింగ్ లో గ్యాప్ వస్తే.. పక్కన ఏదైనా చెట్టు ఉంటే అక్కడే సేద తీరేవారు. కానీ, ప్రస్తుతం కాలం మారింది. ముఖ్యంగా గత పదేళ్లుగా ట్రెండ్ మారింది. ఇప్పుడు చిన్నాచితకా హీరోలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా క్యారవ్యాన్ లకు అలవాటు పడ్డారు. దీనికితోడు వాళ్లకు ఒక్క హిట్ వస్తే చాలు.. ఇక నిర్మాతలు వాళ్లకు అన్ని దగ్గర ఉండి ఏర్పాట్లు చేస్తున్నారు.

    Senior Actor Naresh:

    మొత్తమ్మీద ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ లగ్జరీ క్యారవ్యాన్ ల సంస్కృతి బాగా పెరిగిపోయింది. పైగా ఎవరికీ వారు పోటీ పడుతున్నారు. ఆ పోటీలో ఇన్నాళ్లు మహేష్, బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా స్టార్లు మాత్రమే కనిపించేవారు. కానీ తాజాగా ఆ పోటీలో నేను ఉన్నాను ఎంట్రీ ఇచ్చాడు సీనియర్ నరేష్. దాదాపు అగ్ర హీరోలందరికీ సొంత క్యారవ్యాన్ లు ఉన్నాయి. అందుకే తాజాగా సీనియర్ నటుడు నరేశ్ కూడా ఒక క్యారవ్యాన్ కొనుగోలు చేశాడు.

    Also Read:  జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి గనక చేసుంటే..?

    అన్ని హంగులతో కూడిన క్యారవ్యాన్ ను ముంబయి నుంచి తెప్పించినట్టు వెల్లడించాడు. నటుల జీవితాల్లో 70 శాతం కాలం క్యారవ్యాన్ లలోనే గడిచిపోతుంటుందని.. అందుకే తన అవసరాలకు అనుగుణంగా కొత్త క్యారవ్యాన్ కొనుక్కున్నానని నరేశ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి నరేష్ ఎక్కడ తగ్గట్లేదు. మొత్తమ్మీద నరేష్ లో ఎవడైతే నాకేంటి, నేను హీరోనే అనే ధోరణి బాగా కనిపిస్తోంది.

    అసలు ముంబై నుంచి క్యారవ్యాన్ తెప్పించాల్సిన అవసరం ఏమిటి ? అంటూ నరేష్ గురించి తోటి నటీనటులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. కానీ నరేష్ మాత్రం తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. ఏది ఏమైనా గతంతో పోల్చితే ఇటీవల కాలంలో టాలీవుడ్ లో క్యారవ్యాన్ కల్చర్ బాగా పెరిగింది. అయితే, ఈ క్యారవ్యాన్ ల పోటీలో మొదటి స్థానంలో ఉన్నాడు బన్నీ.

    Actor Naresh

    ఎందుకంటే అల్లు అర్జున్ దగ్గర ఉన్న క్యారవ్యాన్ ఎవ్వరికి లేదు. అంత గొప్పగా బన్నీ తన క్యారవ్యాన్ ను డిజైన్ చేసుకున్నాడు. కాకపోతే, మహేష్ కూడా బన్నీ క్యారవ్యాన్ ను తలదన్నేలా.. తన క్యారవ్యాన్ లోనే ఓ మినీ స్టార్ హోటల్ సెటప్ ను కూడా మహేష్ డిజైన్ చేయించుకున్నాడు. కానీ క్యారవ్యాన్ అనగానే బన్నీనే గుర్తుకు వస్తాడు.

    Also Read: మహేష్ – కీర్తి సురేష్’ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

    Tags