https://oktelugu.com/

Akhanda: అఖండ’ స్పెషల్ షోతో ఊరంతా ఊగిపోయింది !

Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా మామూలుగా సాగడంలేదు. మొన్నటివరకు థియేటర్లలో ఫ్యాన్స్‌ ను పూనకాలు ఊగించిన బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా ప్రతి ఇంట్లో సందడి చేస్తున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కూనంనేనివారి పాలెం వాసులు ఏకంగా ఊర్లోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ‘అఖండ’ స్పెషల్ షో వేశారు. కాగా గ్రామస్థులంతా అక్కడికి వచ్చి సినిమా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 26, 2022 / 12:22 PM IST
    Follow us on

    Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా మామూలుగా సాగడంలేదు. మొన్నటివరకు థియేటర్లలో ఫ్యాన్స్‌ ను పూనకాలు ఊగించిన బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా ప్రతి ఇంట్లో సందడి చేస్తున్నాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కూనంనేనివారి పాలెం వాసులు ఏకంగా ఊర్లోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ‘అఖండ’ స్పెషల్ షో వేశారు.

    Akhanda

    కాగా గ్రామస్థులంతా అక్కడికి వచ్చి సినిమా చూశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. మొత్తానికి అఖండ’ స్పెషల్ షోతో ఊరంతా ఊగిపోయింది మొత్తమ్మీద అఖండ సినిమా రికార్డ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు. నిజానికి సినిమా 50 రోజులు ఆడటం అనే కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది.

    Also Read: ఒకప్పుడు తినడానికి లేదు.. ఇప్పుడు పద్మ శ్రీ.. మొగిలయ్య కష్టం అంతా ఇంతా కాదు

    అలాంటిది అఖండ సినిమాకి 50 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది. పైగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బోసిపోయిన థియేటర్లకు పునర్వైభవాన్ని తీసుకొచ్చింది. సినిమాలకు అడ్రస్ అయిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఏకంగా రూ.కోటి కలెక్షన్లు రాబట్టింది. కోటి కలెక్షన్స్ అంటే ఇది మాములు రికార్డ్ కాదు.

    Akhanda

    ఒక ఏరియాలో ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టడం గొప్ప విషయం. ఇటీవల బాలకృష్ణ కూడా అక్కడికి వెళ్లారు. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టింది. బాలయ్య కెరీర్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అన్నట్టు థియేటర్స్ కే ఈ సినిమా పరిమితం కాలేదు. ఓటీటీలోనూ కొత్త రికార్డ్స్ ను సెట్ చేస్తోంది.

    Also Read: జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు.. అవి గనక చేసుంటే..?

    Tags