ఎవరయ్యా అతన్ని పిలిచింది..!

పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి శైలే వేరు. ఆయన సినిమాలతో పాటు ఆయన వ్యక్తిత్వమూ విభిన్నమే. అయితే నారాయణ మూర్తి తెలుగు సినిమా పెద్దల పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన పై పెద్దలు కూడా సీరియస్ అవుతున్నారట. సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర థ్యాంక్యూ మీట్‌ కి నారాయణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో బడా నిర్మాతలు, దర్శకులు టికెట్ల రేట్లు పెంచడానికి […]

Written By: Neelambaram, Updated On : December 30, 2020 2:59 pm
Follow us on


పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి
శైలే వేరు. ఆయన సినిమాలతో పాటు ఆయన వ్యక్తిత్వమూ విభిన్నమే. అయితే నారాయణ మూర్తి తెలుగు సినిమా పెద్దల పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన పై పెద్దలు కూడా సీరియస్ అవుతున్నారట. సాయిధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్ర థ్యాంక్యూ మీట్‌ కి నారాయణ మూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో బడా నిర్మాతలు, దర్శకులు టికెట్ల రేట్లు పెంచడానికి ప్రయత్నిస్తే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలాగే ప్రభుత్వాలు ఒప్పుకోవద్దని.. దయచేసి సినిమా టికెట్ రేట్లు పెంచి ప్రేక్షకులను ఇబ్బందులకు గురి చేయవద్దని నారాయణ మూర్తి కోరారు.

Also Read: ఆర్ఆర్ఆర్ ‘సీత’ పెళ్లికి ముస్తాబైంది !

నిజానికి గత కొన్ని సంవత్సరాలుగా టికెట్ రేట్లు పెంచాలి అని సినీ పెద్దలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కానీ అంతలో నారాయణ మూర్తి వచ్చి..
టికెట్ రేట్ల పెంపును ఖండించాలని వ్యాఖ్యలు చేయడం, పైగా సీఎం కేసీఆర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాంటి చర్యలను ప్రోత్సహించవద్దు అంటూ ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయడం.. మొత్తానికి నారాయణమూర్తి పై సినీ పెద్దలకు కోపాన్ని తెప్పించింది. ఎవరయ్యా ఫంక్షన్ కి అతన్ని పిలిచింది.. ఇక నుండి నారాయణమూర్తిని సినిమా ఫంక్షన్లకు పిలవొద్దు అని కూడా ఆర్డర్స్ పాస్ చేశారట.

Also Read: ఎన్టీఆర్ కి విలన్ గా సూపర్ స్టార్ ఫిక్స్ !

అయితే నారాయణమూర్తి మాట్లాడింది కూడా కరెక్టే. థియేటర్లలో 50 శాతం అక్యుపెన్సీ అనే కారణం చూపి టికెట్ల రేట్లు పెంచితే.. ఆ భారం ప్రేక్షకుడి మీదే పడుతుంది. కరోనా కాలంలో సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు కూడా కష్టాల పాలయ్యారు, కాబట్టి వారిపై టికెట్ల భారం వేయకండి, దయచేసి టికెట్ రేట్లు పెంచవద్దు అంటూ ఆర్ నారాయణమూర్తి అభిప్రాయపడుతున్నారు. టికెట్ రేట్ పెంచకుండా మాయబజార్, టైటానిక్ లాంటి చిత్రాలు కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టాయి కదా అంటూ ఆయన ఉదాహరణలు కూడా చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్