ఆక్స్ ఫర్డ్ రూపొందించిన అస్ట్రాజెన్కా కరోనా వ్యాక్సిన్ కు బ్రిటన్ దేశం ఆమోదం తెలిపింది. ఇప్పటికే కరోనా స్ట్రేయిన్ తో సతమతమవుతున్న బ్రిటన్ కరోనా వ్యాక్సిన్ కు ఆమోదం తెలపడంతో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఉంది. కొత్త కరోనాతో అతలాకుతమవుతున్న సమయంలో ఈ టీకాతో కాస్త ఉపశమనం లభిస్తోందని ఆలోచిస్తోంది. ప్రస్తుతానికి 10 కోట్ల డోసులను యూకే ఆర్డర్ ఇచ్చింది. 5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆరు లక్షల మందికి టీకాను ఇచ్చారు. ముందుగా 90 ఏళ్ల బామ్మ మార్గరేట్ కీనన్ కు ఫైజర్ టీకాను వేశారు. అయితే ఆక్స్ ఫర్డ్ కు చెందిన ఆస్ట్రాజెనికా టీకా ఎక్కువగా ప్రజాధరణ పొందడంతో ఆ టీకానే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.