వ్యాక్సిన్ పంపిణీకి ‘తెలంగాణ’ ఏర్పాట్లు: స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో సరఫరా..

ఏడాదిపాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ను తరిమేందుకు ఆయా దేశాలు సన్నద్ధమయ్యాయి. వైరస్ ను నిరోధించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్లు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 వాజ్ పేయి జయంతి సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక! తాజాగా తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ కోసం స్టీరింగ్ […]

Written By: NARESH, Updated On : December 13, 2020 12:14 pm
Follow us on

ఏడాదిపాటు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ ను తరిమేందుకు ఆయా దేశాలు సన్నద్ధమయ్యాయి. వైరస్ ను నిరోధించేందుకు ఇప్పటికే వ్యాక్సిన్లు సిద్ధం చేసి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25 వాజ్ పేయి జయంతి సందర్భంగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Also Read: ‘సింధు’ భోజనం.. గొడ్డు, బర్రె, ఓ మేక!

తాజాగా తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ  ఆధ్వర్యంలో వ్యాక్సిన్ సరఫరా కానుంది.   దాదాపు వచ్చే నెలలో రాష్ట్రంలో కరోనా టీకాను పంపిణీ చేయవచ్చని అంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా, మండల టాస్కఫోర్స్ కమిటీలు ఉంటాయి. రాష్ట్ర కమిటీకి చైర్మన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కన్వీనర్ గా ఆరోగ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. వీరితో మరో 18 మంది సభ్యులు ఉంటారు. అలాగే రాష్ట్ర టాస్క్ ఫోర్స్ చైర్ పర్సన్ గా వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి, కన్వీనర్ గా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, 10 మంది సభ్యలు ఉంటారు.

ఇక జిల్లా స్థాయిలో టాస్కఫోర్స్ చైర్మన్ గా కలెక్టర్, కన్వీనర్ గా డీఎంహెచ్ వో ఉంటారు. వీరి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులు ఉంటారు. అలాగే మండల టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా ఎంపీడీవో, కన్వీనర్ గా పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ మరో 5గురు సభ్యులు ఉంటారు.

Also Read: హరీష్ రావు సన్నిహిత నేతపై ఫోకస్ పెట్టిన కాషాయదళం..!

జిల్లా, మండల, మున్సిపల్, జీహెచ్ఎంసీ స్థాయి సమన్వయ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా స్థాయి సమన్వయ కమిటీ చైర్ పర్సన్ గా జిల్లా పరిషత్ చైర్మన్, సభ్యులుగా కలెక్టర్, అడిషినల్ కలెక్టర్ ఉంటారు. మండల సమన్వయ కమిటీలో చైర్ పర్సన్ గా మండల అధ్యక్షుడు, సభ్యులుగా ఎంపీవీడో, హెల్త్ ఆఫీసర్ ఇతర సభ్యులు ఉంటారు.

ఈనెల 25న  దేశవ్యాప్తంగా వ్యాక్షినేషన్ ను ప్రారంభించినా తెలంగాణలో వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. వ్యాక్సిన్ ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ కార్డు ఆధారంగా సరఫరా చేయనున్నారు. అలాగే వ్యాక్సిన్  10 డోసులు ఉండగా ఒక డోసు ఇచ్చిన తరువాత 6 నెలల వ్యవధిలో రెండో డోసు వేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే వ్యాక్సిన్ ఇచ్చిన 30 నిమిషాల పాటు ఆరోగ్య కేంద్రంలో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్