https://oktelugu.com/

RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ముందుకు వచ్చింది. దీనిపై అందరిలో అంచనాలు భారీగా పెరిగాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూవీపై ట్వీట్ చేశారు. ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు. సినిమాకు మంచి స్పందన తీసుకొచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరారు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో తీయడంతో సహజంగానే అందరిలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 25, 2022 / 12:48 PM IST
    Follow us on

    RRR: ఆర్ఆర్ఆర్ మూవీ నేడు విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల ముందుకు వచ్చింది. దీనిపై అందరిలో అంచనాలు భారీగా పెరిగాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మూవీపై ట్వీట్ చేశారు. ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షించారు. సినిమాకు మంచి స్పందన తీసుకొచ్చి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరారు. సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి, యంగ్ హీరో ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ లతో తీయడంతో సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొంది. సినిమా సూపర్ సక్సెస్ కావాలని ఆశిస్తున్నారు.

    Nara Lokesh

    ఆర్ఆర్ఆర్ మానియాతో అటు ఫ్యాన్స్ ఇటు సెలబ్రిటీలు సినిమా గురించే చర్చించుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ ను షేర్ చేస్తూ ట్రిపుల్ సినిమా రికార్డుల పరంపర కొనసాగించాలని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు. రౌద్రం రణం రుధిరం సినిమా ప్రేక్షకుల అంచనాలు మించి సందడి చేయాలని ప్రముఖులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, రాంచరణ్ తమ నటనతో మరింత క్రేజ్ సంపాదించుకుంటారని తెలుస్తోంది.

    Also Read: RRR Craze: ఓవర్సీస్, దేశవ్యాప్తంగా దుమ్మురేపుతున్న ఆర్ఆర్ఆర్

    ఈ సందర్భంగా మెగా హీరో వరణ్ తేజ్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ ఓ చరిత్ర సృష్టిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నటుడు సాయిధరమ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఆర్ఆర్ఆర్ మూవీ చిత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉందని అద్భుతంగా తీశారని కొనియాడారు. భారతీయ సినిమా గర్వించే విధంగా ఉందని ప్రశంసించారు. రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

    Varun Tej

    ఆర్ఆర్ఆర్ మూవీ చాలా బాగుందని నటుడు శ్రీకాంత్ పేర్కొన్నారు ట్రిపుల్ ఆర్ మూవీకి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ఆనంద్ కూడా ఈ సినిమా గర్వించేలా ఉందని ట్వీట్ చేశారు. సినీ రంగంలో దర్శకుడు రాజమౌళిని ఢీకొనే దర్శకుడు లేరని ప్రశంసించారు. ట్రిపుల్ ఆర్ టీంకు ధన్యవాదాలు తెలిపారు. తమిళ నటుడు శివకార్తికేయన్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్ కు శుభాభినందనలు తెలియజేశారు.

    Also Read: RRR Movie: చంద్రబాబు ఇలాకాలో ఆర్ఆర్ఆర్ లొల్లి.. ఘర్షణ

     

    Recommended Video:

    Tags