Jr NTR to meet Jagan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు క్షణాల్లో మారిపోతున్నాయి. ప్రతీ రోజు జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే అసలు ఏమి జరుగుంతుంది? అనే సందేహం రాక తప్పదు. రీసెంట్ గా అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ బెనిఫిట్ షోస్ ని ఆపేయమంటూ మాట్లాడిన ఒక ఫోన్ కాల్ సంభాషణ సోషల్ మీడియా లో లీకై పెద్ద ప్రకంపనలే సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఈ ఆడియో రికార్డు పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫేక్ అని, AI ఆడియో తో చేసిన వీడియో అని, ఎన్టీఆర్ ని నేను పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదని, ఆయనంటే నాకు ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఎమ్మెల్యే అబద్దం ఆడాడని, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని, అది ఎమ్మెల్యే మాట్లాడిన మాటలే అని తేల్చేశారు.
అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా గుట్టుగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు అనవసరమైన రాజకీయాల్లోకి లాగి అతని పై నీచమైన కామెంట్స్ చేస్తున్నారు? అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే చేస్తూ పోతే ఎదో ఒక రోజు ఎన్టీఆర్ కి తిక్కరేగి రాజకీయాల్లోకి వచ్చేస్తాడని, తాత పెట్టిన పార్టీ కాబట్టి న్యాయపరంగా ఆయనకే చెందుతుంది. ఒకవేళ అలా కాకుండా ప్రత్యేకంగా పార్టీ పెట్టి పోటీ చెయ్యాలనే ఆలోచన ఉన్నా, లేదంటే మాజీ సీఎం జగన్ తో కానీ చేతులు కలిపితే టీడీపీ కాలగర్భం లో కలిసిపోతుంది అంటూ సోషల్ మీడియా లో ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ మాజీ సీఎం జగన్(Ys Jagan Mohan Reddy) ని కలవబోతున్నారు అంటూ వార్తలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియదు కానీ, జగన్ అభిమానులు మాత్రం ఎన్టీఆర్ కి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు.
Also Read: శాస్త్రీయ ఆధారాలతో మహాభారత యుద్ధ కాలం తెలిసింది
ఎన్టీఆర్, జగన్ ని కలుపుతూ ఒక వైసీపీ అభిమాని చేసిన వీడియో ఎడిట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఒక ఊపు ఊపేస్తోంది. ప్రాక్టికల్ గా అయితే ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వడం అసాధ్యం. ఎన్టీఆర్ ఒకవేళ వైసీపీ పార్టీ కి సపోర్టు చేస్తే ఇన్నేళ్లు ఆయన సినిమాలను ఆదరిస్తూ వచ్చిన వాళ్లంతా ఒక్కసారిగా రివర్స్ అయిపోతారు. కెరీర్ సర్వనాశనం అవుతుంది, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం అంటే టీడీపీ పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడే, అలా కాకుండా సొంతంగా మరో పార్టీ ని పెట్టి ఎన్నికల్లో పోటీ చెయ్యడమే. ఈ రెండు ఛాయస్ లు మాత్రమే ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టుగా ఎన్టీఆర్, మాజీ సీఎం జగన్ ని కలవబోతున్నారు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదనే అనుకోవాలి.
— Ys Reddy Cm (@kiranreddy4512) August 18, 2025