https://oktelugu.com/

హిరణ్య కశ్యపకు త్రివిక్రమ్ మాటలు.. ?

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కావాలట. గుణశేఖర్ తాను నిర్మించబోయే హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది. కాకపోతే త్రివిక్రమ్ ఉన్న బిజీ దృష్ట్యా నేను ఈ సినిమాకి పూర్తిగా పని చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే స్క్రిప్ట్ లో కచ్చితంగా సహాయం అందిస్తానని త్రివిక్రమ్ చెప్పాడట. ఏది ఏమైనా త్రివిక్రమ్ ను వదిలేలా లేరు. కాగా ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ […]

Written By:
  • admin
  • , Updated On : December 17, 2020 / 05:51 PM IST
    Follow us on


    భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కావాలట. గుణశేఖర్ తాను నిర్మించబోయే హిరణ్య కశ్యప సినిమాకు మాటలు అందించమని త్రివిక్రమ్ ను కోరినట్లు తెలుస్తోంది. కాకపోతే త్రివిక్రమ్ ఉన్న బిజీ దృష్ట్యా నేను ఈ సినిమాకి పూర్తిగా పని చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే స్క్రిప్ట్ లో కచ్చితంగా సహాయం అందిస్తానని త్రివిక్రమ్ చెప్పాడట. ఏది ఏమైనా త్రివిక్రమ్ ను వదిలేలా లేరు. కాగా ‘రానా’ ప్రధాన పాత్రగా ఈ భారీ పౌరాణికం మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

    Also Read: పెళ్లి పై కస్సుబుస్సులాడుతోన్న ‘ముదురు భామ’ !

    ఇక ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారని సమాచారం. ప్రసుతం పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేసుకుంటున్నాడు గుణశేఖర్. మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోందని ఇప్పటికే సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. అన్నట్టు ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది.

    Also Read: మహేష్ బాబు ఫోటోలు చూసి ఆశ్చర్య పోతుంటా !

    అయితే ఇప్పటికే పట్టాలెక్కాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి వర్చ్యువల్ టెక్నాలజీని వాడటమే కారణం అని తెలుస్తోంది. అలాగే పర్ఫెక్షన్, క్వాలిటీ కోసం టీమ్ ఈ సాంకేతికతను వాడుతున్నారట. ఇక రానా చేస్తున్న ‘అరణ్య’ విడుదలకు రెడీ అవడం, వేణు ఊడుగుల దర్శకత్వంలో చేస్తున్న ‘విరాటపర్వం’ చకచకా జరుగుతుండటంతో త్వరలోనే అంటే వేసవి లేదా వేసవి తర్వాత గుణశేఖర్ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే వీలుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్