https://oktelugu.com/

Nani: ఆ స్టార్ హీరో సినిమాకి అసిస్టెంట్ గా చేసిన నాని… ఇప్పుడు ఆయనకే పోటీ ఇస్తున్నాడు…

ప్రస్తుతం ఆయనకి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. ఎవ్వరూ చేయలేనటువంటి కథలను ఎంచుకొని వరుస సక్సెస్ లను కొడుతున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 11, 2023 / 10:53 AM IST

    Hero Nani

    Follow us on

    Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా గుర్తింపు పొందిన నాని వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ప్రస్తుతం ఆయనకి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును తీసుకొచ్చి పెడుతున్నాయి. ఎవ్వరూ చేయలేనటువంటి కథలను ఎంచుకొని వరుస సక్సెస్ లను కొడుతున్నాడు.

    ఇక ఇప్పటికే ఈ సంవత్సరం దసరా అనే సినిమాతో ప్రేక్షక ముందుకు వచ్చి మంచి సక్సెస్ లను సాధించిన నాని ఇప్పుడు హాయ్ నాన్న అనే సినిమా పేరుతో తనదైన రీతిలో ఒక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. తను ఎలాంటి కథలు చేయాలి ఎలాంటి కథలతో వస్తే ప్రేక్షకులు మెప్పిస్తారు అనే విషయంలో నాని చాలా క్లారిటీగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకే ఆయన వేసే క్యాలిక్యులేషన్స్ గాని, చేసే సినిమాలు గానీ నటించడం లో ఎప్పుడు ఫెయిల్ కావడం లేదు. అటు మాస్ సినిమా నుండి క్లాస్ సినిమాలని తేడా లేకుండా అన్ని కలిపి నాని చేస్తున్నాడు అందుకే నాచురల్ స్టార్ గానే కాకుండా యూనివర్సల్ స్టార్ గా కూడా ఎదుగుతున్నాడు ఏ కథనైనా సరే ఈజీగా డీల్ చేయగల కెపాసిటీ ఉన్న యాక్టర్ గా పేరు సంపాదించుకుంటున్నాడు.

    అయితే తన కెరీయర్ లో నాని కొన్ని సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఆ తర్వాత అష్టాచమ్మా అనే సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే నాని శ్రీకాంత్ చేసిన రాధ గోపాలం అనే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. అలాగే నితిన్ హీరో గా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అల్లరి బుల్లోడు సినిమాకి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అలా అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన నాని ప్రస్తుతానికి నితిన్ కి పోటీగా హీరోగా ఎదిగాడు అంటే ఆయన టాలెంట్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.

    అందుకే నాని అంటే ఇండస్ట్రీలో ఉన్న చాలా మందికి రెస్పెక్ట్ ఉంటుంది. తనకంటూ ఇండస్ట్రీ లో ఏ సపోర్టు లేకుండా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ వచ్చి ప్రస్తుతం మంచి స్టోరీలను జడ్జ్ చేసుకొని ఒక అదిరిపోయే సక్సెస్ కొట్టే రేంజ్ లో ముందుకెళ్తున్నాడు… ఇక ఈ ఇయర్ దసరా సినిమాతో హిట్టు కొట్టి ఆయన అనే సినిమాతో కూడా మరో సక్సెస్ ని అందుకున్నాడు…