https://oktelugu.com/

Free Bus Travel: V6 కి వచ్చిన కష్టం పగోనికి కూడా రావొద్దు స్వామీ.. వైరల్ వీడియో

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తోంది. సీఎం నిర్ణయాన్ని మహిళాలోకం స్వాగతిస్తోంది. అయితే గత పాలకుల తరహాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు దీనిపై ఆర్బాటం చేయడం లేదు.

Written By: , Updated On : December 11, 2023 / 10:48 AM IST
Free Bus Travel

Free Bus Travel

Follow us on

Free Bus Travel: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు శ్రీకారం చుట్టింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన రెండు రోజుల్లోనే రెండు గ్యాంరెటీల అమల్లోకి తెచ్చారు. అందులో ఒకటి అభయహస్తం.. రెండోది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. అభయహస్తం కింద ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఇక మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఆర్టీసీ ఫ్రీ జర్నీకి అనూహ్య స్పందన వస్తోంది. మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్‌ బాధ్యత తీసుకున్న వీ6
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి మంచి స్పందన వస్తోంది. సీఎం నిర్ణయాన్ని మహిళాలోకం స్వాగతిస్తోంది. అయితే గత పాలకుల తరహాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు దీనిపై ఆర్బాటం చేయడం లేదు. గతంలో కేసీఆర్‌ ఏ కార్యక్రమం చేపట్టినా మరుసటి రోజు పాల ప్యాకెట్లు చినిగేవి. క్షీరాభిషేకాలు వెల్లువెత్తేవి. పత్రికలు, టీవీల్లో ఫొటోలు, వీడియోలు, కథనాలు ప్రసారమయ్యేవి. కానీ, ఇప్పుడు ఇవేవీ కనిపించడం లేదు. మీడియా అంతా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండడంతో కాంగ్రెస్‌ కార్యక్రమాలను ప్రమోట్‌ చేసే బాధ్యత చెన్నూర్‌ ఎమ్మెల్యే వివేక్‌ చానెల్‌ వీ6 ఎత్తుకుంది.

మహిళ నుంచి షాకింగ్‌ ఆన్సర్‌..
ఈ క్రమంలో ఫ్రీ బస్సు ప్రయాణం గురించి రెండు రోజులుగా బస్టాడ్లలో వీ6 రిపోర్టర్లు తిరిగుతున్నారు. మహిళల అభిప్రాయం తీసుకుని ప్రసారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళా రిపోర్టర్‌ ఓ బస్టాండ్‌కు వెళ్లింది. ‘‘ప్రభుత్వం రెండు రోజుల్లోనే ఫ్రీ బస్సు స్కీం స్టార్‌ చేసింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఈ అవకాశం ఉంది. దీనిని మీరు ఎలా చూస్తారు’’ అని ఓ మహిళను ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఆ మహిళ.. ‘‘ టీవీల్లో చూస్తం’’ అని సమాధానం ఇచ్చింది. ఎలా చూస్తం అన్న అన్న విషయం మాత్రమే ఆమెకు అర్థమైనట్లు ఉంది. టీవీలో చూస్తం అని టక్కున సమాధానం చెప్పింది. ఆమె సమాధానంతో ఖంగుతినడం రిపోర్టర్‌ వంతయింది.