https://oktelugu.com/

Katrina Kaif: పెళ్లి తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కత్రీనా – విక్కీ…

Katrina Kaif: బాలీవుడ్‌ కొత్త పెళ్లి జంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియాకి చిక్కారు. ఇటీవల రాజస్థాన్ లో ఈ జంట సీక్రెట్ గా తక్కువ మంది అతిధులతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కొన్ని రోజులు రాజస్థాన్ లోనే గడిపారు ఈ జంట. కొన్ని ఫోటోలు మాత్రమే తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు విక్కీ కత్రీనా.  తాజాగా ఈ జంట నిన్న ముంబై చేరుకున్నారు. […]

Written By: , Updated On : December 15, 2021 / 10:19 AM IST
Follow us on

Katrina Kaif: బాలీవుడ్‌ కొత్త పెళ్లి జంట విక్కీ కౌశల్‌-కత్రినా కైఫ్‌లు భార్యభర్తలుగా తొలిసారి మీడియాకి చిక్కారు. ఇటీవల రాజస్థాన్ లో ఈ జంట సీక్రెట్ గా తక్కువ మంది అతిధులతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా కొన్ని రోజులు రాజస్థాన్ లోనే గడిపారు ఈ జంట. కొన్ని ఫోటోలు మాత్రమే తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు విక్కీ కత్రీనా.  తాజాగా ఈ జంట నిన్న ముంబై చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రమంలో దిగిన తర్వాత మీడియాకి చిక్కారు. ఎయిర్‌పోర్ట్‌ ముందు మీడియా ఉండటంతో మీడియాకి ఫోజులు ఇచ్చారు.

Katrina Kaif

bollywood couple katrina and vicky caught first time after marriage

Also Read: విక్కీకోసం పంజాబీ నేర్చుకున్న కత్రినా.. ఎందుకో తెలుసా?
పెళ్లి తర్వాత భార్యభర్తలుగా విక్కీ, కత్రినాలు మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్రినా సాంప్రదాయంగా చుడిదార్‌ ధరించి చేతి నిండా మెహందీ, గాజులతో కొత్త పెళ్లికూతురులా మెరిసిపోతుంది. విక్కీ కూడా ఫార్మల్‌ లుక్‌లో అదరగొట్టేసాడు. వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని వచ్చారు. మీడియా పలకరించడంతో అందరికి అభివందనం చేశారు. అక్కడున్న వాళ్లంతా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఫ్యాన్స్ అంతా వైరల్ అవుతున్న ఈ వీడియో, ఫోటోల కింద హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు కత్రినా పెళ్లి సందర్భంగా రణబీర్ కపూర్ రూ.2.7 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్‌ బహుమతిగా ఇవ్వగా… సల్మాన్ ఖాన్ రూ.3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇక అలియా భట్ లక్ష రూపాయలు విలువైన పెర్ఫ్యూమ్ బాస్కెట్ ను కత్రినాకు బహుమతిగా ఇచ్చిందని తెలుస్తోంది.

Also Read: మూడుముళ్ళ బంధంతో ఒక్కటైన మరో బాలీవుడ్ జంట…