https://oktelugu.com/

కాపీ’ కథతో వస్తున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’..! 

న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యయన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇందులో నాని డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్నాడు. ఓ పాత్రలో దర్శకుడిగా.. మరో పాత్రలో కథానాయకుడిగా కన్పించనున్నాడు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘శ్యామ్ సింగరాయ్’ కాపీ కథతో రానున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కాపీకి అర్థం ఎప్పుడో మారిపోయింది. ఇటీవల కాలంలో ప్రతీ సినిమాపై కాపీ మరక పడుతోంది. ఇదే కాపీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 01:22 PM IST
    Follow us on

    న్యాచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకృత్యయన్ ఈ మూవీని తెరకెక్కించనున్నాడు. ఇందులో నాని డ్యూయల్ రోల్స్ లో నటిస్తున్నాడు. ఓ పాత్రలో దర్శకుడిగా.. మరో పాత్రలో కథానాయకుడిగా కన్పించనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘శ్యామ్ సింగరాయ్’ కాపీ కథతో రానున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో కాపీకి అర్థం ఎప్పుడో మారిపోయింది. ఇటీవల కాలంలో ప్రతీ సినిమాపై కాపీ మరక పడుతోంది. ఇదే కాపీ అంశాన్ని ‘శ్యామ్ సింగరాయ్’ మూవీలో హైలెట్ గా చూపించనున్నారు. కాపీపై సెటైర్లు వేస్తూ సినిమా నడుస్తుందని తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్-4: లాస్య నవ్వుల వెనుక తీవ్ర విషాదం..!

    నాని కథానాయకుడిగా నటిస్తున్న సినిమాపై కాపీ మరక పడటాన్ని అతడు ఎలా ఎదుర్కొన్నాడనే సినిమాలో చూపించనున్నారట. తన మూవీ కాపీ సినిమా కాదంటూ పోరాడటాన్ని వినోదాత్మకంగా దర్శకుడు చూపించబోతున్నాడని టాక్ విన్పిస్తోంది. సినిమాలపై కాపీ మరక.. వివాదాలు.. కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ అంశాల చుట్టూ సెటైర్లు వేస్తూ సినిమా సాగనుందని తెలుస్తోంది.

    నాని నటించిన ‘వి’ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ పై పడింది. కరోనా టైంలో ‘శ్యామ్ సింగరాయ్’ మూవీపై భారీ బడ్జెట్ పెట్టడం రిస్కు అని సితార ఎంటర్టైన్మెంట్ వెనక్కి తగ్గింది. అయితే ఈ మూవీ కథపై నానికి నమ్మకం కుదరడంతో వేరే నిర్మాతతో ఈ మూవీ చేసేందుకు నాని మొగ్గుచూపుతున్నాడు.

    Also Read: వైల్డ్ డాగ్ టీంకు గుడ్ బై చెప్పిన నాగ్..!

    ‘వి’ సినిమాతో నాని ఇమేజ్ పై బ్యాడ్ టాక్ వచ్చింది. ఇది పోవాలంటే నాని ‘శ్యామ్ సింగరాయ్’ తప్పనిసరిగా హిట్టు కొట్టాల్సిందే. కథపై నమ్మకంతో నాని చేస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ మూవీకి ఈమేరకు హిట్టిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!