https://oktelugu.com/

త్రివిక్రమ్‌పై మిడ్‌ రేంజ్‌ హీరోల కన్ను

టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన మాటలు.. ఆయన డైలాగ్‌లు.. పంచ్‌లను తలపిస్తుంటాయి. అటువంటి త్రివిక్రమ్‌పై ఇప్పుడు మిడిల్‌ రేంజ్ హీరోల కన్నుపడింది. ఇప్పటికైతే త్రివిక్రమ్‌ కానీ.. కొరటాల అగ్ర దర్శకులు కేవలం సూపర్‌‌స్టార్స్‌తోనే పనిచేశారు. ఇలాంటి టైమ్‍లో త్రివిక్రమ్‍తో పనిచేసే అవకాశముందనేది కొందరు హీరోలు పసిగట్టారు. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ గతంలో నితిన్‍ ‘అ ఆ’ సినిమాలో పారితోషికం తీసుకోకుండా చేశాడు. త్రివిక్రమ్‍ డైరెక్షన్‍లో నటించడమే మహాప్రసాదం అంటూ రెమ్యునరేషన్‍ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 01:26 PM IST
    Follow us on

    టాలీవుడ్‌ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్‌ ఒకరు. ఆయన మాటలు.. ఆయన డైలాగ్‌లు.. పంచ్‌లను తలపిస్తుంటాయి. అటువంటి త్రివిక్రమ్‌పై ఇప్పుడు మిడిల్‌ రేంజ్ హీరోల కన్నుపడింది. ఇప్పటికైతే త్రివిక్రమ్‌ కానీ.. కొరటాల అగ్ర దర్శకులు కేవలం సూపర్‌‌స్టార్స్‌తోనే పనిచేశారు. ఇలాంటి టైమ్‍లో త్రివిక్రమ్‍తో పనిచేసే అవకాశముందనేది కొందరు హీరోలు పసిగట్టారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    గతంలో నితిన్‍ ‘అ ఆ’ సినిమాలో పారితోషికం తీసుకోకుండా చేశాడు. త్రివిక్రమ్‍ డైరెక్షన్‍లో నటించడమే మహాప్రసాదం అంటూ రెమ్యునరేషన్‍ రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు అలాగే కొందరు యువ హీరోలు త్రివిక్రమ్‍తో ఫ్రీగా చేస్తామంటూ ముందుకొస్తున్నారు. ఎన్టీఆర్‍తో అనుకున్న సినిమా ఆలస్యమైతే త్రివిక్రమ్‍ ఈలోగా ఒక మిడ్‍ రేంజ్‍ సినిమా చేయవచ్చు. అయితే దీనిపై ఇంకా త్రివిక్రమ్‍ నిర్ణయం తీసుకోలేదు.

    Also Read: బిగ్ బాస్-4: లాస్య నవ్వుల వెనుక తీవ్ర విషాదం..!

    ఎన్టీఆర్‌‌కు ముందు రామ్‍తో చేస్తాడంటూ వార్తలు వినిపిస్తున్నా ఇంకా క్లారిటీ లేదు. రామ్‍కి ఛాన్స్ ఉందనే సరికి ఇంకొందరు హీరోల్లోనూ ఆశ పుట్టిందట. అయితే త్రివిక్రమ్‍ మాత్రం తారక్‍ కోసమే ఎదురు చూస్తున్నాడు. అల వైకుంఠపురములో తర్వాత చేసే సినిమాలో ‘ఆర్‍.ఆర్‍.ఆర్‍’ తర్వాత ఎన్టీఆర్‍ నటిస్తే ఉండే క్రేజ్‍ ఎలా ఉంటుందనేది త్రివిక్రమ్‍కి తెలుసు కాబట్టి.. ఎన్టీఆర్‌‌ కోసం వేచిచూస్తున్నారు.

    Also Read: వైల్డ్ డాగ్ టీంకు గుడ్ బై చెప్పిన నాగ్..!

    అటు మిడ్‌ రేంజ్‌ హీరోలు సైతం ఇన్నాళ్లు వచ్చిన గ్యాప్‌ను స్టార్‌‌ డైరెక్టర్‌‌తో సినిమా తీసి హిట్‌ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. కరోనా గ్యాప్‌ను హిట్‌తో పూడ్చాలని కలలు కంటున్నారు. కానీ..ఈ హీరోల ఆశలకు త్రివిక్రమ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తారా.. లేదా అనేది ఆసక్తిగా మారింది.