Paradise
Paradise : సినిమా సినిమాకి తనని తాను అప్డేట్ చేసుకుంటూ, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇవ్వడానికి తపన పడే హీరోలలో ఒకరు నేచురల్ స్టార్ నాని(Natural Star Nani). ఒకప్పుడు పక్కంటి కుర్రాడి రోల్స్ ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల ఇళ్లల్లో ఒక మనిషిగా మారిపోయిన నాని, ఆ తర్వాత మాస్ సినిమాలు చేస్తూ ఆ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ లో అత్యంత ప్రజాధారణ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) తెరకెక్కించిన ‘దసరా’ చిత్రం నాని కెరీర్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు మీడియం రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ వచ్చిన నాని, ఈ సినిమాతో వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆయన శ్రీకాంత్ ఓదెల తో కలిసి ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే చిత్రం చేస్తున్నాడు.
నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ఒకటి విడుదలైంది. ఈ గ్లిమ్స్ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవ్వరూ ఆలోచన చేయనటువంటి కాన్సెప్ట్ ఇది. కాకి బ్యాక్ డ్రాప్ లో ఎదో చెప్పడానికి గ్లిమ్స్ ద్వారా ప్రయత్నం చేసారు కానీ, అది కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాలేదు. కానీ గ్లిమ్స్ చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతం అని కామెంట్స్ చేసారు. మ్యాజిక్ చేయడం అంటే ఇదే. అయితే ఈ సినిమాని హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిల్చిన ‘సిటీ ఆఫ్ ది గాడ్'(City Of The God) అనే చిత్రాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్నారని సోషల్ మీడియా లో కొందరు అభిప్రాయపడ్డారు. ఆ సినిమా పోస్టర్ ని, ‘ది ప్యారడైజ్’ పోస్టర్ ని పక్కపక్కనే పెట్టి పోల్చి చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది.
Also Read : ప్యారడైజ్ కథ తెలిసిపోయిందిగా…నాని పొడుగు జడల వెనక కారణం ఇదేనట… శ్రీకాంత్ మామూలుగా ప్లాన్ చేయలేదుగా…
‘సిటీ ఆఫ్ ది గాడ్’ మూవీ స్టోరీ విషయానికి వస్తే అణగారిన వర్గాల నుండి వచ్చిన యువకుడు, పేదరికం పై పోరాటం చేసి, వాళ్లకు నాయకుడిగా నిలుస్తాడు. అందుకు అతను ఎన్నో అసాంఘిక కార్యకలాపాలను మొదలు పెడుతాడు. చూసేందుకు ఈ సినిమా స్టోరీ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది. ‘ది ప్యారడైజ్’ కూడా ఆ లైన్ మీద తెరకెక్కుతున్న సినిమానేనా? అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు. తెలంగాణ లో కాకి యొక్క ప్రాధాన్యత ఎలాంటిదో మనం ‘బలగం’ సినిమా ద్వారా తెలుసుకున్నాము. ‘ది ప్యారడైజ్’ చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కాబట్టి, కచ్చితంగా కాకి అనే అంశం ఎదో ముఖ్యమైన సామజిక అంశానికి అనుసంధానించి తీసినది గా అనుకోవచ్చు. మార్చి 26 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై ఇప్పటి నుండే అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఫారిన్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Also Read : జడ వేసి.. హీరో నానినే చూపించలేదే.. ‘ప్యారడైజ్’లో శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీ ఏంటి.?