Dasara 2 Movie
Dasara 2 Movie : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి చిత్రం ‘దసరా'(Dasara Movie). అప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాని ని మరో లెవెల్ కి తీసుకెళ్లి పెట్టిన చిత్రమిది. ఓపెనింగ్స్ అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయిల షేర్, వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఆయన గత చిత్రానికి క్లోజింగ్ లో వచ్చిన థియేట్రికల్ షేర్ వసూళ్లు, ఈ చిత్రానికి కేవలం మొదటి రోజే వచ్చాయి. కేవలం ఓపెనింగ్ వసూళ్లు మాత్రమే కాదు, క్లోజింగ్ లో కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలంగాణ ప్రాంతంలో అయితే పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ వసూళ్లు, నాని చిత్రానికి రావడం అప్పట్లో ఒక సంచలనం.
అలాంటి హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ చేయబోతున్నట్టు డైరెక్టర్ శ్రీకాంత్ ప్రకటించి చాలా కాలమే అయ్యింది. కానీ ప్రస్తుతం నాని ద్రుష్టి ఆ సినిమా మీద లేదు. ఎందుకంటే ఈ ఏడాది నాని నుండి ‘హిట్ 3′(Hit : The Third Case) విడుదల కాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఆయన వెంటనే శ్రీకాంత్ ఓదెల తో ‘ది ప్యారడైజ్'(The Paradise) అనే చిత్రాన్ని చేయబోతున్నాడు. ముందుగా ఈ చిత్రానికి బదులు ‘దసరా 2′(Dasara 2 Movie) నే చేద్దామని అనుకున్నారు కానీ, బడ్జెట్ భారీగా అవసరం ఉండడంతో ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఎందుకంటే ఈ చిత్రానికి నాని రెమ్యూనరేషన్ గా 40 కోట్ల రూపాయిలు అడిగాడట. అంత రెమ్యూనరేషన్ ఇవ్వలేమని నిర్మాత సుధాకర్ చెప్పడంతో, ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. నాని రీసెంట్ గానే మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాడు.
శిభి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ‘ది ప్యారడైజ్’ చిత్రంతో పాటు, ఈ సినిమాని కూడా సమాంతరంగా చేయబోతున్నాడట. ఈ రెండు చిత్రాల తర్వాత ఆయన తన సొంత నిర్మాణం లో మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సినిమాని నిర్మించడమంటే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి. అందుకే ఆ సినిమా పూర్తి అయ్యే వరకు నాని వేరే సినిమాపై ద్రుష్టి పెట్టే అవకాశాలు లేవట. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ‘దసరా 2 ‘ అంటే చాలా పెద్ద వ్యవహారం, దానికి ఫుల్ ఫోకస్ పెట్టాలి కాబట్టి కొంతకాలం ఆ చిత్రాన్ని హోల్డ్ లో పెట్టాలని నిర్ణయించుకున్నాడట. చూడాలి మరి అసలు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది.
దసరా 2 ‘ ఇక లేనట్టేనా..? నాని డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషనే అందుకు కారణమా?
నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కెరీర్ లో మైల్ స్టోన్ లాంటి చిత్రం ‘దసరా'(Dasara Movie). అప్పటి వరకు సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న నాని ని మరో లెవెల్ కి తీసుకెళ్లి పెట్టిన చిత్రమిది. ఓపెనింగ్స్ అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల నుండి 15 కోట్ల రూపాయిల షేర్, వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఆయన గత చిత్రానికి క్లోజింగ్ లో వచ్చిన థియేట్రికల్ షేర్ వసూళ్లు, ఈ చిత్రానికి కేవలం మొదటి రోజే వచ్చాయి. కేవలం ఓపెనింగ్ వసూళ్లు మాత్రమే కాదు, క్లోజింగ్ లో కూడా ఈ చిత్రానికి కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలంగాణ ప్రాంతంలో అయితే పాతిక కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే ఈ వసూళ్లు, నాని చిత్రానికి రావడం అప్పట్లో ఒక సంచలనం.